యూనినార్ కొత్త పథకాలు : రోజుకు రూపాయి.. అపరిమితంగా ఫేస్‌బుక్!

ఫేస్‌బుక్, వాట్స్ యాప్ వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌లలో ఎక్కువ సమయం గడిపే ఖాతాదారుల కోసం యూనినర్ కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్లలో భాగంగా తమ ఖాతాదారులు గంటకు 50 పైసలు, రోజంతా రూపాయి, వారానికి రూ.5, నెలకు రూ.16 చొప్పున చెల్లించి ఫేస్ బుక్ ను అపరిమితంగా ఉపయోగించుకోవచ్చని యూనినార్ తెలిపింది. అలాగే, రోజుకు రూపాయి, వారానికి రూ.5, నెలకు రూ.15 చొప్పున చెల్లించి వాట్స్ యాప్‌ను అపరిమితంగా వినియోగించుకోవచ్చని యునినార్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ వ్యాపార విభాగాపు అధిపతి సతీశ్ కన్నన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ ప్రత్యేకమైన పథకాల్లో భాగంగా ఫేస్‌బుక్‌ను అపరిమితంగా ఉపయోగించుకోవాలనుకునే యునినార్ యూజర్లు *555*101#కు డయల్ చేయావల్సి ఉంటుంది. వాట్స్ యాప్‌ను అపరిమితంగా ఉపయోగించుకోవాలనుకునే యునినార్ యూజర్లు*555*201#కు డయల్ చేసి స్కీమ్‌ను యాక్టివేట్ చేసుకోవల్సి ఉంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications