ఏప్రిల్‌లో 'ఆకాశ్ - 2': కపిల్ సిబల్

Posted By: Prashanth

ఏప్రిల్‌లో 'ఆకాశ్ - 2': కపిల్ సిబల్

 

ఆకాశ్ టాబ్లెట్ పీసీని మరింత అభివృద్ధి చేసి ఆకాశ్-2 గా ఏప్రిల్‌లో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విడుదల చేసిన ఆకాశ్ నాణ్యతపై సందేహాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆకాశ్ ట్యాబ్లెట్‌కున్న భారీ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ మంది ఉత్పత్తిదారులు అవసరమని కేంద్ర మంత్రి కపిల్‌సిబల్ వెల్లడించారు. ఆకాశ్ తయారీకి కావలసిన మార్గదర్శకాలను వారికి సూచించామని... ఈ క్రమంలో వినియోగదారుల నుంచి వచ్చిన పలు సూచనలను పరిగణనలోకి తీసుకుంటునట్టు ఆయన తెలిపారు. సమస్యలను పరిష్కరించగలమన్న ఆశాభావం సిబల్ వ్యక్తం చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot