Home
Computer

Windows 10 లో ఈ ట్రిక్స్ గురించి మీకు తెలుసా..?

By Bommu Sivanjaneyulu

మైక్రోసాఫ్ట్ అందిస్తోన్న అత్యత్తమ ఆపరేటింగ్ సిస్టంలలో విండోస్ 10 ఒకటి. ఈ ఓఎస్ ఎప్పటికప్పుడు యూజర్ యాక్టివిటీ హిస్టరీని సేకరించటంతో పాటు దానికి కంప్యూటర్ అలానే క్లౌడ్‌లలో భద్ర పరుస్తుంటుంది. యూజర్లు ఈ డేటాను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కావల్సిన మేర డిలీట్ చేసుకునే వీలుంటుంది.

విండోస్ 10 ఏఏ వాటిని ట్రాక్ చేస్తుంది..?

విండోస్ 10 ఏఏ వాటిని ట్రాక్ చేస్తుంది..?

మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎడ్జ్ బ్రౌజర్, బింగ్ సెర్చ్ ఇంజిన్, లొకేషన్ డేటా ఇంకా కార్టోనా వర్చువల్ అసిస్టెంట్‌ కమాండ్స్‌కు సంబమంధించిన యాక్టివిటీలను నిత్యం ట్రాక్ చేస్తుంటాయి. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ హెల్త్‌వాల్ట్ లేదా మైక్రోసాఫ్ట్ బ్యాండ్ డివైస్‌ను మీరు వినియోగిస్తున్నట్లయితే, అందులోని మీ యాక్టివిటీలు మొత్తం ఆయా సర్వీసుల్లోనే స్టోర్ కాబడతాయి. ఈ డేటా మొత్తాన్ని యూజర్ల సౌకర్యార్థమే ట్రాక్ చేసి ఉంచుతున్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది.

విండోస్ 10లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ఎలా?

విండోస్ 10లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ఎలా?

స్టెప్ 1 : ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity Historyలోకి వెళ్లండి.

స్టెప్ 2 : Clear Activity History ఆప్షన్ క్రింద క్రింద కనిపించే క్లియర్ బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకునే వీలుంటుంది.

స్టెప్ 3 : విండోస్ మీ డేటాను కలెక్ట్ చేయకూడదనుకుంటే 'Let Windows collect my activities' ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుకోవల్సి ఉంటుంది.

విండోస్ 10లో పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు ప్రొసీజర్..

విండోస్ 10లో పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు ప్రొసీజర్..

స్టెప్ 1 : ముందుగా మీ డివైస్‌లోని Settings -> Privacy -> Activity History -> Manage my activity infoలోకి వెళ్లండి.

స్టెప్ 2 : బ్రౌజర్ విండో పాపప్ అయిన వెంటనే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అక్కడ మీ అకౌంట్‌కు సంబంధించిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు లొకేషన్ యాక్టివిటీ, వాయిస్ యాక్టివిటీ ఇంకా కార్టోనా నోట్‌బుక్ యాక్టివిటీలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి.

Best Mobiles in India

English summary
windows 10 collects and saves your activity history both on your computer and to the cloud, from browsing history to location information to everything in between.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X