Home
Computer

చిట్కాలతో బోలెడన్ని ప్రయోజనాలు!

కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్‌లు పూర్తిగా చార్జ్ అయ్యేందుకు నిర్ధేశిత సమయం కంటే అధిక సమయాన్ని తీసుకుంటాయి. అయితే, ఈ జాప్యానికి గల కారణాలు చాల మందికి తెలియదు. ఫోన్ వేగవంతంగా చార్జ్ అయ్యేందుకు పాటించాల్సిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.....

ఫోన్ వేగవంతంగా చార్జ్ అవ్వాలంటే సదరు చార్జర్‌ను నేరుగా అవుట్ లెట్‌కే అనుసంధానించండి. కంప్యూటర్ ద్వారా చార్జింగ్ అంత ఉపయుక్తమైనది కాదు. చార్జింగ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఫోన్‌లో రన్ అవుతున్న అప్లికేషన్‌లను ఆఫ్ చేయటం మంచిది. ముఖ్యంగా జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌లను టర్న్ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ను టర్న్ ఆఫ్ చేయండి. చార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌కు తీసుకురండి. చార్జింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మ్యూజిక్ వినటం అంత శ్రేయస్కరం కాదు.

చిట్కాలతో బోలెడన్ని ప్రయోజనాలు!

మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది.

సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది. బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి. బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం. బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి. అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి. స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి. ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి. ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X