తక్కువ ధరలకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్!!!

Posted By: Prashanth

తక్కువ ధరలకే ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ టాబ్లెట్!!!

 

కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ల ఉత్పాదక సంస్థ వెలాసిటీ మైక్రో (Velocity Micro) గడిచిన ఏడాది అనేక వేరింయట్‌‌లలో డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ టాబ్లెట్ కంప్యూటర్‌లను ప్రవేశపెట్టింది. మార్కెట్లో ఈ పీసీలు సక్సెస్ టాక్ తెచ్చుకోవటంతో భవిష్యత్త్ కార్యచరణను మరింత బలోపేతం చేసే దిశగా ఈ బ్రాండ్ వర్గాలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ఆశలు, కొంగొత్తు ఆశయాలతో ప్రారంభమైన 2012కు శుభారంభాన్నిస్తూ వినియోగదారుడికి లబ్ధి చేకూర్చే విధంగా మన్నికైన ఫీచర్లతో కూడిన టాబ్లెట్ పీసీలను తక్కువ ధరకే అందించేందుకు ‘వెలాసిటీ మైక్రో’ ప్లాన్ చేసింది. ‘క్రజ్ T507’, ‘క్రజ్ T510’ వేరియంట్‌లలో డిజైన కాబడిన ఈ అత్యుత్తమ కంప్యూటింగ్ డివైజ్‌లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ పై రన్ కానున్నాయి.

క్రజ్ T507 ముఖ్య ఫీచర్లు:

* శక్తివంతమైన కార్టెక్స్ ప్రాసెసర్, * 400 MHz ARM Mali గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * ర్యామ్ 512 ఎంబీ, * ఇంటర్నెల్ మెమరీ 8జీబి, * 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, * హెచ్డీఎమ్ఐ అవుట్, * ఆమోజన్స్ అప్లికేషన్ స్టోర్, * ధర రూ.8,000.

క్రజ్ T510 ప్రధాన ఫీచర్లు:

* శక్తివంతమైన కార్టెక్స్ ప్రాసెసర్, * 400 MHz ARM Mali గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, * ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, * ర్యామ్ 512 ఎంబీ, * ఇంటర్నెల్ మెమరీ 8జీబి, * 9.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * హెచ్డీఎమ్ఐ అవుట్, * ఆమోజన్స్ అప్లికేషన్ స్టోర్, * డ్యూయల్ కెమెరాస్, * ధర రూ.15,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot