విమానం ద్వారా పిజ్జా డెలివరీ

Posted By:

విమానం ద్వారా పిజ్జా డెలివరీ

ఆర్డర్ తీసుకున్న పిజ్జాలను ఆయా ప్రాంతాలకు డెలివరీ చేసేందుకు గాను ఓ చిన్నపాటి విమానాన్ని ఉపయోగించి ముంబయ్ కు చెందిన ప్రముఖ సంస్థ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ముంబైలోని ట్రాఫిక్ అవాంతరాలను దృష్టిలో ఉంచుకుని ఫ్రాన్సి‌స్కోస్ పిజ్జీరియా సంస్థ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా పిజ్జాల డెలివరీ నిమిత్తం మానవ రహిత విమానాన్ని ఉపయోగించి కంపెనీ మిశ్రమ ఫలితాలను రాబట్టింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

పిజ్జా డెలివరీ నిమిత్తం ఈ తరహా డ్రోన్ ను ఉపయోగించటం ఇండియాలో ఇదే మొదటి సారి. తమ అవుట్ లెట్ నుంచి సుమారు ఒకటిన్నర కిలోమాటర్ల దూరంలో ఉన్న వినియోగదారుడికి ఈ నెల 11న మానవ రహితం విమానం ద్వారా పిజ్జాను డెలివరీ చేయగలిగామని ఫ్రాన్సి‌స్కోస్ పిజ్జీరియా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి మైఖేల్ రజనీ తెలిపారు. ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ విమానాలను రాబోయే సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయలో వినియోగంలోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. అటోమొబైల్ ఇంజనీర్ గా వ్యవహరిస్తున్నఓ మిత్రుడి సహకారంతో ఈ విమానాన్ని రూపొందించినట్లు రజనీ తెలిపారు.ఈ డ్రోన్ రూపకల్పనకు రూ.1,20,000 ఖర్చయినట్లు ఆయన చెప్పారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/0if2PM6OBrI?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting