వీడియోకాన్ నుంచి 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీలు

Posted By:

ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ వీడియోకాన్ తమ మొట్టమొదటి 4కే రిసల్యూషన్ అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. 5 మోడళ్లలో లభ్యంకున్నాన్న ఈ టీవీలను 40 నుంచి 85 అంగుళాల స్ర్కీన్ సైజు వేరియంట్‌లలో వీడియోకాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రారంభ ధర రూ.91,000.

వీడియోకాన్ నుంచి 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీలు

దీపావళి నాటికి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో ఈ టీవీలను అందుబాటులోకి  తీసుకువచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఈ టీవీలను వీడియోకాన్ ఔరంగాబాద్ ప్లాంట్‌లో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీ సెట్‌లను మొదటిగా ముంబయ్, థానే, పూణే, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో విక్రయించనున్నారు. వీడియోకాన్ 4కే అల్ట్రా హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీ ప్రత్యేకతలు:

4కే అల్ట్రా హైడెఫినిషన్ స్ర్కీన్,
3డీ గేమింగ్ సౌకర్యం,
ఫేస్ రికగ్నిషన్ ఫీచర్,
ఎన్ స్ర్కీన్ మరియు హోమ్ క్లౌడ్ టెక్నాలజీ.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting