శ్యామ్‌సంగ్‌ను ఎదుర్కొనే ‘ధీరుడొచ్చాడు’..!!

Posted By: Super

శ్యామ్‌సంగ్‌ను ఎదుర్కొనే ‘ధీరుడొచ్చాడు’..!!

సాంకేతిక పరికరాల ప్రపంచంలో దిగ్గజ బ్రాండ్‌గా హవా కొనసాగిస్తున్న ‘శ్యామ్ సంగ్’కు, ‘వ్యూ సోనిక్’ రూపంలో చిక్కులు ఎదురుకానున్నాయి. శ్యామ్‌సంగ్ విడుదల చేయుబోతున్న ‘గెలక్సీ ట్యాబ్ 7.7’ టాబ్లెట్ పీసీకి సరితూగే విధంగా ‘వ్యూ ప్యాడ్ 7’ పేరుతో వ్యూ సోనిక్ సంస్థ టాబ్లెట్ పీసీని మార్కెట్లో విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా రూపుదిద్దుకున్న ‘వ్యూ ప్యాడ్ 7’ UMTS కనెక్టువిటీ సామర్ధ్యం, సింగిల్ కోర్ క్వాల్‌కమ్ ఎమ్ఎస్ఎమ్ ప్రొసెస్సింగ్ వ్యవస్థ కలిగి ఉంటుంది. 7 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే స్వభావం కలిగిన ఈ టాబ్లెట్ పీసీ మన్నికైన పని వ్యవస్థను కలిగి ఉంటుంది. శక్తివంతమైన 7.7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో రూపుదిద్దుకున్న ‘గెలక్సీ ట్యాబ్ 7.7’ ఆండ్రాయిడ్ హనీకూంబ్ 3.2 ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా పనిచేస్తుంది. ఈ పీసీలో పొందుపరిచిన మల్టీ టచ్ వ్యవస్థ వినియోగదారునికి మరింత లబ్ధిచేకూర్చుతుంది.

కెమెరా విషయానికి వస్తే ‘వ్యూ ప్యాడ్’ 3 మెగా పిక్సల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. వీడియో కాన్ఫిరెన్స్ కాల్స్‌కు సంబంధించి సెకండరీ కెమెరాను ఈ పరికరంలో పొందుపరిచారు. ‘గెలక్సీ 7.7’లోనూ డ్యూయల్ కెమెరా వ్యవస్థను పొందుపరిచారు. మెమరీ విషయానికొస్తే 16,32,62 జీబీల వేరియంట్లలో టాబ్లెట్ పీసీలు లభ్యమవుతాయి. ‘వ్యూప్యాడ్’ మెమరీ విషయానికొస్తే ఎక్స్‌టర్నల్ మైక్రో ఎస్‌‌డి విధానం ద్వారా 32 జీబీకి వృద్ధి చేసుకోవచ్చు.

కనెక్టువిటీ అంశంలో ముందంజలో ఉన్న శ్యామ్‌సంగ్ 802.11b/g/n వై - ఫై, 3.0 బ్లూ టూత్ వంటి ఆధునిక వ్యవస్థలను ‘గెలక్సీ’లో ప్రవేశపెట్టింది. బ్లూ టూత్ ఎంపిక విషయంలో కాస్తంత వెనుకంజలో ఉన్న ‘వ్యూప్యాడ్ 7’ అధునాతన వై - ఫై వ్యవస్థను కలిగి ఉంటుంది. వీటి ధరలను పరిశీలిస్తే ‘వ్యూ సోనిక్’ భారతీయ మార్కెట్లో రూ.30 వేలకు లభ్యమవుతుంది. గెలక్సీ 7.7 ధర విషయం తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot