‘వ్యూసోనిక్’.. ఇప్పుడు కొత్త మోతాదులో..!!

Posted By: Staff

‘వ్యూసోనిక్’.. ఇప్పుడు కొత్త మోతాదులో..!!


‘‘ఓ బంపర్ ఆఫర్ మీ కోసం వేచిచూస్తుంది..!, అందుకునేందుకు మీరు సిద్ధమేనా..!, త్వరపడండి... ఆ ఆవిష్కరణకు కౌండ్ డౌన్ మొదలైంది. ప్రముఖ విజువల్ డిస్ ప్లే పరికరాల తయారీదారు ‘వ్యూసోనిక్’ (Viewsonic) అద్బుత ఆఫర్ ను వినియోగదారుల ముంగిట ఉంచింది. రూ.10,000లకే అత్యాధునిక టాబ్లెట్ పీసీని అందించేందుకు బ్రాండ్ ముందుకొచ్చింది. ‘వ్యూప్యాడ్ 7e’వర్షన్ లో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్ అత్యుత్తమ పనితీరును ప్రదర్శిస్తుందని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో విడుదల కాబోతున్న ఈ టాబ్లెట్ పీసీని విద్యార్థులకు మరింత తగ్గింపు ధరకు అందించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు ‘వ్యూసోనిక్’ నేషనల్ సేల్స్ అధికారి ఒకరు తెలిపారు.’’

క్లుప్తంగా ‘వ్యూప్యాడ్ 7e’ ఫీచర్లు:

- సమర్దవంతమైన ఆండ్రాయిడ్ జింజర్ బోర్డ్ 2.3 ఆపరేటింగ్ వ్యవస్థను టాబ్లెట్ లో లో్డ్ చేశారు.

-1GHz Arm Cortex-A8 ప్రొసెసింగ్ వ్యవస్థ వేగవంతమై పనితీరును కలిగి ఉంటుంది.

-512 MB DDR2 SDRAM వ్యవస్థ పటిష్ట స్టోరేజి సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- 7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే, 800X600 రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- టాబ్లటె్ వెనుక భాగంలో 3 మెగా పిక్సల్, ముందు భాగంలో 0.3 మెకా పిక్సల్ కెమెరాలను అమర్చారు.

- వై-ఫై 802.11 b/g/n, బ్లూటూత్ 2.1 కనెక్టువిటీ వ్యవస్థలు సమచారాన్ని మరింత వేగంగా ట్రాన్స్ ఫర్ చేస్తాయి.

- ఏర్పాటు చేసిన ‘HDMI’ వ్యవస్థ సౌలభ్యతతో పెద్ద స్ర్కీన్ లకు టాబ్లెట్ ను జత చేసుకోవచ్చు.

- ఇంటర్నల్ మెమరీ 4జీబీని, 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot