ఊరించే ట్రీట్‌కు.. మీరు రెడీనా..?

Posted By: Prashanth

ఊరించే ట్రీట్‌కు.. మీరు రెడీనా..?

 

గ్యాడ్జెట్ ప్రేమికులను ఊరించే ట్రీట్ ఇచ్చేందుకు వ్యూసోనిక్ సిద్ధమైంది. బార్సిలోనోలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్లను ఆవిష్కరించనుంది. వ్యూసోనిక్ జీ70, వ్యూసోనిక్ ఇ100, వ్యూసోనిక్ పీ100 నమూనాలలో ఈ మూడు అత్యుత్తమ కంప్యూటింగ్ డివైజ్‌లను వ్యూసోనిక్ ఇటీవల డిజైన్ చేసింది. వీటిలో వ్యూసోనిక్ జీ70, ఇ100లు ఆండ్రాయిడ్ వర్షన్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. మరొక వేరియంట్ వ్యూసోనిక్ పీ 100 మాత్రం విండో్స్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

వ్యూసోనిక్ జీ70 ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,

* క్రిస్టల్ క్లియర్ క్వాలిటీనందించే 7 అంగుళాల LCD టచ్ స్ర్ర్కీన్,

* తక్కువ రేడియేషన్ విడుదల చేసే తత్వం,

* మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

* 3జీ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్,

* 2.3 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో ఛాటింగ్ నిర్వహించుకునేందుకు),

* 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 32జీడి ఎక్సటర్నల్ మెమెరీ,

* ఇన్ బుల్ట్ సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్స్,

* ఆండ్రాయిడ్ మార్కెట్లోకి ప్రవేశించే సౌలభ్యత.

వ్యూసోనిక్ ఇ100 ముఖ్య ఫీచర్లు:

* ఆండ్రాయిడ్ 4.0 ఆపరేటింగ్ సిస్టం,

* 9.7 అంగుళాల టచ్ డిస్‌ప్లే,

* శక్తివంతమైన 1 GHz కార్టెక్స్ ప్రాసెసర్,

* బ్లూటూత్ వీ3.0,

* వై-ఫై, 3జీ కనెక్టువిటీ, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్

వ్యూసోనిక్ పీ100 ముఖ్య ఫీచర్లు:

* విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టం,

* 10 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* ఇంటెల్ ఎన్200 డ్యూయల్ కోర్ ప్రాసెసర్,

* 3జీ, వై-ఫై.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot