మేం రె‘ఢీ’..!! మీరు సిద్ధమేనా..?

Posted By: Super

మేం రె‘ఢీ’..!! మీరు సిద్ధమేనా..?

విజువల్ డిస్‌ప్లే సాంకేతిక పరికరాలు వ్యాపారంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా నిలిచిన ‘వ్యూ సోనిక్’ సంస్థ తమ తొలి ఆండ్రాయిడ్ హనీకూంబ్ ఆధారిత ‘వ్యూ ప్యాడ్ 7x’ను టాబ్లెట్ పీసీని భారతీయ మార్కెట్లో విడుదల చేసేందు సన్నాహాలు చేస్తోంది.

నిత్యం రద్దీగా ఉండే ఇండియన్ మార్కెట్లో విడుదలకాబోతున్న 7 అంగుళలా ‘వ్యూప్యాడ్ 7x’లో హనీకూంబ్ ఆపరేటింగ్ వ్యవస్థతో పాటు న్విడియా డ్యూయల్ కోర్ టెగ్రా 2 ప్రొసెసర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టీఎఫ్టీ టచ్ స్వభావం కలిగిన ఈ టాబ్లెట్ పీసీలో అత్యుత్తమ వెబ్ పేజ్ వ్యూవింగ్ సామర్థ్యాన్ని కల్పించారు. కట్టింగ్ ఎడ్జ్ డిజైన్‌తో రూపొందించబడిన ‘వ్యూ ప్యాడ్’ కేవలం 378 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.

ఈ ‘వ్యూ ప్యాడ్’లో 2 కెమెరాలను పొందుపరిచినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పొందుపరిచిన 8జీబీ ఇంటర్నల్ మెమరీని 32జీబీ వరకు పెంచుకోవచ్చు. లయోన్ స్టాండర్డ్ బ్యాటరీ వ్యవస్థను ఈ పీసీలో పొందుపరిచారు. హై డెఫినిషన్ సామర్ధ్యంతో కూడిన వీడియో డీకోడ్, ఎన్‌కోడ్ వంటి అంశాలు వినియోగదారునికి మరింత లబ్ధి చేకూరుస్తాయి.

సెట్లో ముందుగానే లోడ్ చేసిన సోషల్ నెట్ వర్కింగ్ ఆప్లికేషన్లు సమాచార వ్యవస్థను మరింత చేరువుచేస్తాయి. వై - ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి. త్వరలో విడుదల కాబోతున్న ‘వ్యూప్యాడ్ 7x’ ధర రూ.30,000 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot