‘కొత్త ఏడాదికి గాను సరికొత్త ఆరంభం’, ఎవరా బ్రాండ్..?

Posted By: Prashanth

‘కొత్త ఏడాదికి గాను సరికొత్త ఆరంభం’, ఎవరా బ్రాండ్..?

 

కొత్త ఏడాదికి గాను సరికొత్త ఆరంభాన్నివ్వటానికి ఆ బ్రాండ్ ఉవ్విల్లూరుతుంది. సాంకేతిక ప్రేమికులకు సుపరిచతమైన ‘వ్యూ సోనిక్’ (Viewsonic) ఓ ఆధునిక టాబ్లెట్ కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌ను కొత్త ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వ్యూప్యాడ్ 10S’గా బోలెడన్ని యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ టాబ్లెట్ పీసీ పనితీరు ఏ పాటిదో పరిశీలిద్దామా...

గుగూల్ ఆండ్రాయిడ్ 2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం పై టాబ్లెట్ రన్ అవుతుంది. న్విడియా టెగ్రా 250 SMP డ్యూయల్ కార్టెక్స్ - A9 ప్రాసెసింగ్ వ్యవస్థను డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ఈ శక్తివంతమైన ఫీచర్ల కలయకతో డివైజ్ పనితీరు వేగవంతమవతుంది. గ్యాడ్జెట్ డిస్ ప్లే 10. అంగుళాలు, మల్టీ టచ్ స్వభావం కలిగి ఉంటుంది. ఈ విధమైన సౌలభ్యతతో డివైజ్‌ను సులువుగా చేతితో ఆపరేట్ చేయ్యచ్చు.

ర్యామ్ సామర్ధ్యం 512 ఎంబీ (DDR2 టైప్), మైక్రో ఎస్డీ‌కార్డ్ స్లాట్ విధానం ద్వారా టాబ్లెట్ మెమరీని 32కు జీబికి వృద్ధి చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 1.3 మెగా పిక్సల్ వెబ్ కెమెరా సౌకర్యవంతమైన వీడియో ఛాటింగ్ కు దోహదపడుతుంది. 1.5వాట్ పవర్ అవుట్‌పుట్‌ను విడుదల చేసే స్టీరియో స్పీకర్లను డివైజ్‌లో ఏర్పాటు చేశారు. పొందుపరిచిన హై డెఫినిషన్ ఆడియో వ్యవస్థ మ్యూజిక్‌ను వినసొంపైన కోణంలో అందిస్తుంది.

పరికరంలో నిక్షిప్తం చేసిన ‘వై-ఫై’ ఇంటర్నెట్ వేగాన్ని పెంచుతుంది. ఆండ్రాయిడ్ మార్కెట్లోకి ప్రవేశించే సౌకర్యం. హెచ్డీఎమ్ఐ కనెక్టువిటీ వ్యవస్థ టాబ్లెట్‌ను హై డెఫినిషన్ టీవీలకు కనెక్ట్ చేసుకునే వెసలుబాటను కల్పిస్తుంది. బ్లూటూత్ 2.1, యూఎస్బీ 2.0 వ్యవస్థలు డేటాను వేగవతంగా షేర్ చేస్తాయి. దోహదం చేసిన మల్టీ మీడియా ప్లేయర్ వ్యవస్థ అన్ని రకాల సహజ మీడియా ఫైళ్లను సపోర్ట్ చేస్తుంది. పటిష్టమైన ‘3300 mAh’ బ్యాటరీ వ్యవస్థ మన్నికైన బ్యాకప్ నిస్తుంది. ఇండియన్ మార్కెట్లో వ్యూప్యాడ్ 10S టాబ్లెట్ ధర రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot