‘విజియో’ టాబ్లెట్, ‘చిన్న పరికరం లేదిక కలవరం’!!

Posted By: Staff

‘విజియో’ టాబ్లెట్, ‘చిన్న పరికరం లేదిక కలవరం’!!


ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు ‘విజియో’ టాబ్లెట్ వినియోగదారులకు మరింత చేరువయ్యే క్రమంలో అత్యాధునిక ఫీచర్లు కలిగిన టాబ్లెట్ పీసీని తక్కువ ధరలో ప్రవేశపెట్టింది.

వినూత్న ఆవిష్కరణలతో దినదినాభివృద్ధి చెందుతున్న ‘విజియో’ VTAB1008 పేరుతో సరికొత్త టాబ్లెట్ పరికరాన్నిమార్కెట్లో ప్రవేశపెట్టి ‘ఆండ్రాయిడ్ ఆధారిత 3.x హనీకూంబ్’ టాబ్లెట్ పరికరాలకు ప్రత్యర్థిగా నిలిచింది. 8 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం కలిగిన ఈ గ్యాడ్జెట్ ‘యూజర్ ఫ్రెండ్లీ’గా పనిచేస్తుంది. ‘కాంప్యాక్ట్ ఫుట్‌ప్రింట్’ వంటి ఆడ్వాన్సడ్ ఫీచర్లను ఈ పీసీలో పొందుపరిచారు.

మరో విశిష్ట ఫీచర్‌ను టాబ్లెట్ పీసీలో పరిశీలిస్తే రిమోట్ కంట్రోల్ ఆథారితంగా గ్యాడ్జెట్ పనిచేస్తుంది. ‘యూ ట్యూబ్’లను వీక్షించేందుకు ఆడోబ్ ఫ్లాష్ ప్లేబ్యాక్ వ్యవస్థను టాబ్లెట్‌లో పొందుపరిచారు. ఆప్లికేషన్ వ్యవస్థలతో పాటు, టచ్ బటన్ వ్యవస్థలను సౌకర్యవంతంగా డిజైన్ చేశారు. 1 పౌండ్ బరువు టాబ్లెట్ పీసీకి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇంటర్నల్ స్టోరేజి సామర్ధ్యం 4జీబీ కలిగి ఉండగా ఎస్ఎస్‌డీ విధానం ద్వారా మెమరీని వృద్ధి చేసుకోవచ్చు.

టాబ్లెట్ ముందుభాగంలో అమర్చిన కెమెరా వ్యవస్థ నాన్యమైన వీడియో కాలింగ్‌కు ఉపకరిస్తుంది. 1GHz ARM CPU, 512 MB మెమరీ వ్యవస్థను టాబ్లెట్‌లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. యూట్యూబ్, జీ మెయిల్, ఫేస్ బుక్, గుగూల్ మ్యాప్ వంటి ఫ్రీలోడెడ్ ఆప్లికేషన్లు వినియోగదారుడికి మరింత లబ్థి చేకూరుస్తాయి. అన్ని వర్గాలు భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేవిధంగా టాబ్లెట్ పీసీ ధరను రూ.12,600కు నిర్థారించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting