కంప్యూటింగ్ సెక్టార్‌లోకి అమెరికా అరంగ్రేటం..?

Posted By: Prashanth

కంప్యూటింగ్ సెక్టార్‌లోకి అమెరికా అరంగ్రేటం..?

 

అమెరికన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ విజియో(Vizio) ఆ దేశ టెలివిజన్ ఉత్పత్తుల రంగంలో ఎనలేని గుర్తింపు సాధించిన విషయం తెలిసిందే. మన్నిక, విశ్వసనీయత వంటి అంశాలతో అక్కడి వినియోగదారులకు మరింత చేరువైన ఈ బ్రాండ్ తాజాగా కంప్యూటింగ్ ఉత్పత్తుల విభాగం పై దృష్టిసారించింది.

ఫీచర్ రిచ్ డెస్క్‌టాప్ కంప్యూటర్స్ అదే విధంగా ల్యాప్‌టాప్‌లను డవలెప్ చేసేందుకుగాను సంస్థ కసరత్తులు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. తొలి ప్రయత్నంగా ఐదు కంప్యూటింగ్ ఉత్పత్తులను విజయో రూపొందించింది. వీటిలో మూడు నోట్‌బుక్‌లు కాగా రెండు ఆల్-ఇన్-వన్ కంప్యూటర్లు. ఈ తాజా నిర్ణయంతో విజియో ఉత్పత్తుల పరిధి నోటు‌బుక్‌ల నుంచి ఆల్-ఇన్-వన్ పీసీల వరకు విస్తరించింది. ఈ గ్యాడ్జెట్‌లు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

మూడు నోట్‌బుక్‌లలో రెండింటిని స్టైలిష్ అల్ర్టాబుక్స్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. 15.6, 14 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లలో ఇవి లభ్యం కానున్నాయి. మరో స్టాండర్డ్ నోట్‌బుక్ 15.6 అంగుళాల డిస్‌ప్లే సామర్ధ్యం కలిగి ఉంటుంది. తక్కిన రెండు ఆల్ -ఇన్ -వన్ కంప్యూటర్లు ఒకటి 24 అంగుళాల డిస్‌ప్లేతో, మరొకటి 27 అంగుళాల డిస్‌ప్లే వేరియంట్‌లో రూపుదిద్దుకున్నట్లు తెలసింది.

ఇతర స్పెసిఫికేషన్‍ల వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. వచ్చే వారం లాస్‌వేగాస్‌లో నిర్వహించనున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో వీటిని ప్రదర్శించనున్నారు. ఆధునిక టెక్నాలజి సాయంతో అత్యంత మన్నికగా రూపుదిద్దుకున్న ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్లు ‘మే’లో అందుబాటులోకి వస్తాయి. ధర ఇతర ఫీచర్ల వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot