ఆ బాధ్యతను ‘వోడాఫోన్’ తన భుజాన్నేసుకుంది..!!

Posted By: Super

ఆ బాధ్యతను ‘వోడాఫోన్’ తన భుజాన్నేసుకుంది..!!

ఫ్లాష్.. ఫ్లాష్.. తాజా వార్త .. సాంకేతిక పరికరాల తయారీలో ప్రపంచ వ్యాప్తంగా తమదైన గుర్తింపు తెచ్చుకున్న ‘శ్యామ్ సంగ్’ టాబ్లెట్ కంప్యూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టిన ‘శ్యామ్‌సంగ్’ మార్కెట్లో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. శ్యామ్‌సంగ్ గెలక్సీ 750, శ్యామ్ సంగ్ గెలక్సీ 730 పేర్లతో ఈ రెండు టాబ్లెట్ పీసీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నెలాఖారులో ఈ మోడళ్లు మార్కెట్లోకి రానున్నట్లు శ్యామ్ సంగ్ వర్గాలు ప్రకటించాయి.

ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లతో పాటు టాబ్లెట్ పీసీ పరికరాలకు నెలకున్న డిమాండ్ నేపధ్యంలో తాము ప్రవేశపెట్టబోతున్న రెండు టాబ్లెట్ పీసీలు జనాధరణను సొంతం చేసుకంటాయని, ‘శ్యామ్‌సంగ్’ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ అధ్యక్షుడు ఒకరు ఈ మేరకు ఓ ప్రకటన విడదల చేశారు.

ఆండ్రాయిడ్ 3.1 ఆధారితంగా పనిచేసే ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 750’ మార్కెట్ ధరను రూ.36,200కు నిర్థారించారు. ఈ టాబ్లెట్ పీసీ 1 జీబీ ర్యామ్(RAM)‌తో పాటు 1 జిగా హెడ్జి(GHz) ప్రాసెస్సర్ కలిగి ఉంటుంది. ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 750’తో పొలిస్తే తక్కువ సైజు అంటే 8.9 అంగుళాల స్ర్కీన్ కలిగిన ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 730’ ధరను రూ.33,990కి నిర్థారించారు. ‘గెలక్సీ 750’ తరహాలో ఈ టాబ్లెట్ పీసీ జీబీ ర్యామ్(RAM)తో పాటు 1 జిగా హెడ్జి (GHz) ప్రాసెస్సర్ కలిగి ఉంటుంది. ఈ రెండు టాబ్లెట్లలో ఇంటర్నల్ స్టోరేజీ సామర్ధ్యం 16 జీబీ (GB) వరకు కల్పించారు.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 750’ 7,000 mAh సామర్ధ్యం కలిగి ఉండగా. ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 730’ 6,100 mAh సామర్ధ్యం కలిగి ఉంది. అధునాతన ఫీచర్లతో రూపుదిద్దకున్న ఈ టాబ్లెట్ పీసీలు ప్రత్యేక విశేషాలు కలిగి ఉన్నాయి. ఈ టాబ్లెట్లలో ముందుగానే అమర్చని ‘ప్రీలోడెడ్ మొబైల్ టీవి’ 55 భారతీయ ఛానెళ్లను నాణ్యమైన అనుభూతితో మీకు అందిస్తుంది. ఇందులో పొందు పరిచిన రీడర్ అప్లికేషన్ 17 న్యూస్ పేపర్లతో పాటు వివిధ మ్యగాజైన్లుకు సంబంధించి వార్తా విశేషాలను మీకు అందిస్తుంది, అంతే కాదు వివిధ బాషలకు సంబంధించి 30,000 భారతీయ పుస్తకాలను మీరు ఈ టాబ్లెట్ ద్వారా చదవచ్చు.

మార్కెట్లో శ్యామ్‌సంగ్ టాబ్లెట్ల ప్రమెషన్ ప్రక్రియలో భాగంగా మొబైల్ ఆపరేటింగ్ నెటవర్క్ అయిన ‘వోడాఫోన్’ శ్యామ్ సంగ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తూ వివిధ ఆఫర్లను ప్రవేశపెడుతుంది. అయితే భారతీయ మార్కట్ సెగ్మంట్‌లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న శ్యామ్‌సంగ్ ప్రవేశపెట్టబోతున్న ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ 750, గెలక్సీ 730’ టాబ్లెట్ పీసీలు ఏ మేరుకు హిట్ కొడతాయో చూద్దాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot