కేకపుట్టిస్తున్న కొత్త రిలీజ్‌లు!!

Posted By: Super

కేకపుట్టిస్తున్న కొత్త రిలీజ్‌లు!!

 

తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొనటంతో రోజుకో కొత్త మోడల్ పుట్టుకొస్తోంది. వీటిలో ఏ వేరియంట్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియక వినియోగదారులు తికమక పడాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. టాబ్లెట్ పీసీల విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలికిన ప్రభుత్వ కంపెనీ ‘ఆకాష్’ప్రేరణగా అనేక కొంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. తాజాగా వికిడ్‌లీక్ అనే సంస్థ ‘వామ్మీ 7’ పేరుతో టాబ్లెట్‌ను డిజైన్ చేసింది. ఆండ్రాయిడ్ ఆధారితంగా పనిచేసే ఈ కంప్యూటింగ్ డివైజ్ ‘ఆకాష్’ పీసీకి గట్టి పోటీనివ్వగలదని పలువురు విశ్లేషిస్తున్నారు.

వామ్మీ 7 ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.2గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ10 ఆల్ విన్నర్ ప్రాసెసర్,

400మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ ర్యామ్,

ఇంటర్నల్ మెమెరీ 4జీబి,

మైక్రోఎస్డీ స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు,

డాంగిల్ సహాయంతో 3జీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

గుగూల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించే సౌలభ్యత,

హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ సౌలభ్యతతో టాబ్లెట్‌ను హై డెఫినిషన్ టీవీలకు అనుసంధానించుకోవచ్చు,

5 గంటల బ్యాకప్ నిచ్చే 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర రూ.5,300.

ఈ గ్యాడ్జెట్‌ను కొనదలచిన ఔత్సాహికులు వికిడ్ లీక్ ఇంక్ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించి సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot