ఆహార పదార్థాల్లో క్యాలరీలను పసిగట్టే సెన్సార్!

Posted By:

ఆహార పదార్థాల్లో క్యాలరీలను పసిగట్టే సెన్సార్!

ఆహార పదార్థాలను స్కాన్ చేసి వాటిలో ఎంత మోతాదులో క్యాలరీలు ఉన్నాయో..?, ఎనెన్ని కార్బోహైడ్రేట్‌లు ఉన్నాయో తెలిపే సరికొత్త మాలిక్యులర్ సెన్సార్‌ను ఇజ్రాయిల్‌కు చెందిన కన్స్యూమర్ ఫిజిక్స్ ఇంక్ అనే స్టార్టప్ రూపొందించింది.

ఈ పాకెట్ సైజ్ మాలిక్యులర్ సెన్సార్ పేర్ స్కయో(SCiO), ఈ సెన్సార్‌ను ఏదైనా ఆహార పదార్థానికి దగ్గరగా ఉంచి సదరు సెన్సార్‌కు సంబంధించ ఓ బటన్‌ను రెండు సెకన్ల పాటు ప్రెస్ చేసినట్లయితే ఆ పదార్థాన్ని సెన్సార్ పూర్తిగా విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్‌కు చేరవేస్తుంది. తద్వారా ఆ పదార్థానికి సంబంధించిన పోషకాల వివరాలను తెలుసుకోవచ్చు.

ప్రస్తుతం కంపెనీ ప్రోటోటైప్ స్కయో సెన్సార్ పై ప్రయోగాలు చేస్తోంది. వాణిజ్య పరంగా ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకుగాను 200,000 డాలర్లను నిధులు రూపటంలో సేకరించేందుకు డెవలపర్లు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 2014 నాటికి స్కయో మాలిక్యులర్ సెన్సార్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/BrtGSEwfIJY?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot