నీటిలో పడినా సమర్ధవతంగా పని చేస్తుంది!!!

Posted By: Prashanth

నీటిలో పడినా సమర్ధవతంగా పని చేస్తుంది!!!

 

వర్షం అదే విధంగా చెమ్మ వాతావరణాల్లో కంప్యూటింగ్ గ్యాడ్జెట్‌లు మోరయించటం సహజం. ఈ విధమైన ఉష్టోగ్రతలను సమర్థవంతంగా తట్టుకుని పనిచేసే విధంగా పాన్‌టెక్ (Pantech) సంస్థ పటిష్టమైన టాబ్లెట్ పీసీని డిజైన్ చేసింది.

వర్షపు వాతావరణంలో ఈ టాబ్లెట్ డిస్‌ప్లే దెబ్బతినకుండా పని చేసేందుకు గాను స్ప్లాష్ రెసిస్టెంట్ వ్యవస్థను నిక్షిప్తం చేశారు. పొందుపరిచిన టచ్ స్ర్కీన్ వ్యవస్థ కంప్యూటింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తుంది. టాబ్లెట్ పనితీరు వేగవంతంగా ఉండేందుకు గాను డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను దోహదం చేశారు. యూజర్ ఫ్రెండ్లీ స్వభావం కలిగిన ఆండ్రాయిడ్ 3.2 హనీకూంబ్ ఆపరేటింగ్ సిస్టం పై పీసీ రన్ అవుతుంది. 8 అంగుళాల స్ర్కీన్ టచ్ స్ర్కీన్ స్వభావం కలిగి పెద్ద తెర అనుభూతిని మీకు చేరవ చేస్తుంది.

5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా మీ అనుభూతులను మన్నికైన క్వాలిటీతో పదిలపరుస్తుంది. ఏర్పాటు చేసిన 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా ప్రత్యక్ష వీడియో ఛాటింగ్‌కు ఉపకరిస్తుంది. 16జీబి డివైజ్ ఇంటర్నల్ మెమరీ డాక్యుమెంట్‌లు ఇతర ముఖ్య ఫైళ్లను పదిలపరుస్తుంది. ఈ నెల 8న విడుదల కాబోతున్న పాన్‌టెక్ ఎలిమెంట్ టాబ్లెట్ ధర వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot