Home
Computer

Incognito modeలో చేసే వెబ్ బ్రౌజింగ్ సురక్షితమేనా..?

సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే.

By Bommu Sivanjaneyulu

సెక్యూర్డ్ బ్రౌజింగ్‌ను కొరుకునే వారికోసం, అన్ని ప్రముఖ బ్రౌజర్లు ఇన్‌కాగ్నిటో మోడ్‌ బ్రౌజింగ్ సదుపాయాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్‌ ఫోన్లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఈ మోడ్‌లో బ్రౌజింగ్ చేసేటపుడు ఎటువంటి హిస్టరీగాని, కుకీస్ లేదా పాస్‌వర్డ్స్ అనేవి సేవ్ అవ్వవు. ఒకవేళ మీరు ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో బ్రౌజ్ చేస్తునపుడు ఏవైనా గూగుల్ యాప్స్ లేదా థర్డ్ పార్టీ సర్వీసుల్లోకి లాగిన్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రొవైడర్, మీ లావాదేవీలను ట్రాక్ చేయటం జరుగుతుంది.

నెటిజనుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు..

నెటిజనుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు..

Incognito mode వినియోగం పట్ల నెటిజనులకు ఉన్న అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో అమెరికా అలానే జర్మనీకి చెందిన ప్రముఖ రిసెర్చర్ల బృందం ఓ ప్రత్యేకమైన స్టడీని కండక్ట్ చేసింది. ఈ స్టడీలో మొత్తం 450 మంది పాల్గొనగా, వారిలో ఒక్కొక్కరికి ఒక్కో టాస్కును రిసెర్చర్లు అసైన్ చేసారు. ఈ టాస్క్‌లో భాగంగా తమకు అసైన్ చేసిన పనులను వారు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో పూర్తి చేయవల్సి ఉంటుంది. టాస్క్స్ పూర్తయిన అనంతరం స్టడీ ఫలితాలను విశ్లేషణ చేసిన రిసెర్చర్ల బృందం పలు ఆసక్తికర అభిప్రాయాలను సేకరించగలిగింది.

వేరు వేరు అభిప్రాయాలు..

వేరు వేరు అభిప్రాయాలు..

ఈ స్టడీలో పాల్గోన్న 56.3% మంది ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో తాము చేసిన సెర్చ్ డేటా ఏ మాత్రం సేవ్ కాలేదని అభిప్రాయపడగా, 40.2% మంది మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో తమ లొకేషన్‌ను ఏ వెబ్‌సైట్ కూడా ట్రాక్ చేయలేదని నమ్మారు. మరో 22 నుంచి 37% మంది మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో తాము బ్రౌజ్ చేస్తున్నపుడు కంపెనీలు లేదా థర్డ్ పార్టీ సర్వీసులు డేటాను ఏ విధంగానూ యాక్సెస్ చేసుకోలేకపోయాయని అన్నారు. ఈ స్టడీలో పాల్గొన్న కొద్ది శాతం మంది మాత్రం ఇన్‌కాగ్నిటో మోడ్‌‌లో బ్రౌజ్ చేస్తునపుడు వైరస్ ప్రొటెక్షన్ బాగా పెరిగిందని తెలిపింది.

ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే...

ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే...

వాస్తవానికి Incognito mode ద్వారా మీరు చేసే వెబ్ బ్రౌజింగ్ హిస్టరీ ఎవరికి తెలియదనుకుంటే పొరబడినట్లే. ఈ ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్ ద్వారా మీరు చేసే బ్రౌజింగ్ హిస్టరీ లోకల్ డ్రైవ్‌లో మాత్రమే సేవ్ కాదు. మీ ఇంటర్నెట్ సర్వీస్‌ను మానిటర్ చేసేవారి డ్రైవ్‌లో బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం సేవ్ అవుతుంది.

పూర్తిగా దాచబడినట్లు కాదు...

పూర్తిగా దాచబడినట్లు కాదు...

Incognito mode ద్వారా మీరు చేసే డౌన్‌లోడ్స్ అన్ని, మీ లోకల్ డ్రైవ్‌లోనే స్టోర్ అవుతాయి. ఇన్‌కాగ్నిటో అంటే దాచబడినా అని అర్థం. అలా అని పూర్తిగా దాచబడినట్లు కాదు. పలు కార్పొరేట్ కంపెనీలు పర్యవేక్షణ బృందం సహాయంతో ప్రైవేట్ బ్రౌజింగ్ సెషన్‌లో తమతమ ఉద్యోగుల విజిట్ చేసిన యూఆర్ఎల్స్ ను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాయి.

Best Mobiles in India

English summary
Incognito mode is just for private browsing. If you choose to use Incognito mode, then your web browser won’t be saving any history, cookies or passwords. It can be trackable.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X