Home
Computer

బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తున్నారా.. ఈ స్పెసిఫికేషన్‌లు కచ్చితంగా ఉండేలా చూసుకోండి..!

ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్‌ లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు ఎక్కువగా ల్యాప్‌టాప్‌ ల కొనుగోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌ లో వివిధ బ్రాండ్ల నుంచి అనేక ధరల సెగ్మెంట్స్‌ లో ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఎలాంటి ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలి, కొనుగోలు సమయంలో ఏయే స్పెసిఫికేషన్‌ లకు ప్రాధాన్యత ఇవ్వాలనే కన్‌ఫ్యూజన్ అనేక మందిలో ఉంటుంది.

బడ్జెట్‌ రేంజ్‌ లో (Budget Laptop) ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేసే సమయంలో కొన్ని స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌లతో రాజీపడాల్సి ఉంటుంది. అయినా సగటు అవసరాలకు అనుగుణంగా ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలంటే ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పూర్తి వివరాలతో కూడిన కథనం.

buying budget laptop

ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి :
మీరు రూ.30 వేల నుంచి రూ.50 వేల మధ్యలో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేయాలని భావిస్తుంటే.. బిల్ట్‌ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్‌, డిస్‌ప్లే, స్టోరేజీ, ర్యామ్‌, ప్రాసెసర్‌ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని కొనుగోలు చేయాలి.

డిస్‌ప్లే : బడ్జెట్‌ ధరలో ల్యాప్‌టాప్ కొనుగోలు చేస్తున్నా.. మెరుగైన డిస్‌ప్లే వైపు కచ్చితంగా మొగ్గుచూపాలి. విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాస్‌ల కోసం అదే విధంగా ఉద్యోగులు వారి ఆన్‌లైన్‌ మీటింగ్స్‌, ఇతర డాక్యుమెంట్‌ పై పనిచేస్తున్న సమయంలో ఫుల్‌ HD డిస్‌ప్లేలతో మెరుగైన అనుభూతిని పొందుతారు. సాధారణ డిస్‌ప్లేలతో పోలిస్తే FHD డిస్‌ప్లే PC లు ఆకట్టుకుంటాయి.

ప్రాసెసర్ : ఏ ల్యాప్‌టాప్‌ లో అయినా ప్రాసెసర్‌ అత్యంత ముఖ్యమైనది. ల్యాప్‌టాప్‌ ఇతర స్పెసిఫికేషన్‌ లు ఎంత మెరుగ్గా ఉన్నా.. ప్రాసెసర్‌ ఎంపికలో మాత్రం కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బడ్జెట్‌ ధరలో చూసినా కనీసం ఇంటెల్‌ కోర్‌ i3 లేదా AMD RyZen 3 ప్రాసెసర్‌ ఉండేలా చూసుకోవాలి.

మెరుగైన చిప్‌సెట్‌ ను ఎంచుకుంటేనే రోజువారీ పనులను సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు. అంటే రోజువారీ బ్రౌజింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆన్‌లైన్‌ మీటింగ్స్‌, ఆన్‌లైన్‌ క్లాస్‌లు, ఏవైనా డాక్యుమెంట్‌ తయారీ వంటి పనులను సులభంగా చేసుకోగలుగుతాం.

buying budget laptop

ర్యామ్ : ప్రాసెసర్‌ తోపాటు ర్యామ్‌ కూడా ల్యాప్‌టాప్‌ పనితీరులో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కనీసం 8GB ర్యామ్‌ కలిగిన ల్యాప్‌టాప్‌ ను కొనుగోలు చేయండి. ఫలితంగా మల్టిపుల్‌ ట్యా్బ్‌లతో పనిచేసినా, ఆఫీస్ టూల్స్‌ ఉపయోగించినా మెరుగైన పనితీరును కనబరుస్తుంది.

స్టోరేజీ : బడ్జెట్‌ రేంజ్‌ లో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తున్నా.. ప్రాసెసర్‌, ర్యామ్‌తోపాటు స్టోరేజీ పైనా దృష్టిసారించాలి. అంతే కనీసం 256GB SSD స్టోరేజీ ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మీ బేసిక్‌ అవసరాలు పూర్తి చేసుకోగలగుతారు. అయితే భవిష్యత్‌తో అధిక స్టోరేజీ అవసరం అయితే ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌ డ్రైవ్‌లను కొనుగోలు చేసుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్ : బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తున్నా.. మీ రోజువారీ విధులకు, ఎడ్యుకేషన్‌ కోసం సరిపోయేలా ఉండాలి. దీంతోపాటు USB, HDMI, హెడ్‌ఫోన్‌ జాక్‌ వంటి పోర్ట్‌లు ఉండేలా చూసుకోవాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
what are the specifications to be considered whenever buying budget laptop full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X