ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా దేశంలోని యువత సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు. దేశీయంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, లింకిడన్, గూగుల్+, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనికేషన్ మాద్యమాలకు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. అయితే చాలా మంది ఇంటర్నెట్ వ్యవస్థను కేవలం కమ్యూనికేషన్ అవసరాలు ఇతర వినోద కార్యాకలాపాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే, ఇంటర్నెట్ వల్ల బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
- ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఏ కంప్యూటర్ వినియోగదారుడైనా ఇ-మెయిల్ ఫీచర్‌ను వినియోగించుకుని ఉత్తర ప్రత్యుత్తరాలను నిమిషాల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు.
- డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ద్వారా వివిధ వెబ్‌సైట్‌ల నుంచి ఉపయోగకర సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా అనేక మంది తమ ఎదుగుదలకు సంబంధించి అనేక విషయాలను ఇంటర్నెట్ ద్వారా తెలసుకోవచ్చు.
- ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి వాణిజ్య ప్రయోజనాలను పొందవచ్చు.
- ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న విద్యార్థులు వివిధ కోర్సులకు సంబంధించి ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవచ్చు.
ఇంటర్నెట్ ద్వారా డబ్బు సంపాదించే మార్గాలు
స్వీయ పుస్తక ప్రచరణ : కలంతో మంచి స్నేహం ఉందా..?, పుస్తకాలు రాయగలరా..? అయితే మీ కోసం అమోజాన్ సంస్థ ‘కైండిల్ డైరెక్ట్ పబ్లిషింగ్' పేరతో ఉచిత సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సర్వీస్‌లో భాగంగా మీరు రాసిన పుస్తకాన్ని మీరు స్వతహాగా ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేసుకోవచ్చు. మన దేశానికి చెందిన పలువురు రచయతలు ఈ తరహాలోనే ఆదాయన్ని అర్జిస్తున్నారు.
అప్లికేషన్‌లను తయారు చేసి విక్రయించండి : స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలు వినియోగం రోజురోజుకు విస్తరిస్తుండటంతో అపిక్లేషన్ విభాగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మీలో సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నట్లయితే విభిన్నంగా ఆలోచించి అప్లికేషన్‌ను రూపొందించండి. మీ ఆలోచన బాగునట్లయితే సదురు అప్లికేషన్ కాసులు వర్షం కురిపిస్తుంది.
ఆన్‌లైన్ ద్వారా పాత వస్తువులను విక్రయించండి : డబ్బు సంపాదించేందుకు ఇదో సులువైన మార్గం. మీ చుట్టు పక్కల ఉన్న పాత వస్తువులను సేకరించండి. క్లిక్ డాట్ ఇన్, వోఎల్ఎక్స్ డాట్ ఇన్, క్వికర్ డాట్ కామ్ వంటి వెబ్‌సైట్‌లు ఉచిత క్లాసిఫైడ్ వేదికలను ఏర్పాటు చేస్తున్నాయి. వాటిలో మీరు ఓ ఖాతాను తెరిచి మీ చెంత ఉన్న పాత ఉత్పత్తులకు సంబంధించి వివరాలను పొందుపరచండి. ఆసక్తి ఉన్న వారు మిమ్మల్ని సంప్రదించటం జరుగుతుంది.
ఈ-ట్యూటరింగ్ : శిక్షణా విభాగంలో మీకు అనుభవం ఉందా. ఏదైనా సబ్జెక్టును అనర్గళంగా బోధించగలరా..? అయితే మీకోసం www.2tion.net or www.tutorvista.com వంటి ఆన్‌లైన్ శిక్షణా వెబ్‌సైట్‌లు ఎదురుచూస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లలో మీ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసినట్లయితే ధృవీకరణ అనంతరం ఔత్సాహికులు మీ సేవలను వినియోగించుకుంటారు. మీ నైపుణ్యం ఆధారంగా పారితోషకం ఉంటుంది. ఆన్‌లైన్ షాప్‌ను ప్రారంభించండి


Click it and Unblock the Notifications








