మీ ల్యాప్‌టాప్‌తో నిత్యం సమస్యలా..?

మీ ల్యాప్‌టాప్ తరచూ shut-down అవుతోందా..?, సాధారణంగా ల్యాప్‌టాప్ హ్యాంగ్ అవటానికి సాఫ్ట్‌వేర్ లోపం కావొచ్చు, హార్డ్‌వేర్ మాల్ ఫంక్షన్ కావొచ్చు. సమస్య సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే సదరు సాఫ్ట్‌వేర్‌ను ట్రబుల్ షూట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. సమస్య హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే పలు భాగాలను మార్చవల్సి ఉంటుంది. ల్యాప్‌టాప్ shut-down సమస్యలను పరిష్కరించుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

Read More : లెనోవో K8 Plus లాంచ్ అయ్యింది, ధర రూ.10,999, స్పెషల్ ఫీచర్స్ ఇవే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవ్వటం..

ల్యాప్‌టాప్ ఓవర్ హీట్ అవ్వటం వల్ల కూడా shut-down సమస్యలు తలెత్తే అవకావముంది. వాస్తవానికి ల్యాపీ అవటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఒక ల్యాప్‌టాప్‌లో ఉత్పన్నమయ్యే ఓవర్ హీట్‌ను మరో ల్యాప్‌టాప్‌లో జనరేట్ అయ్యే వేడితో కంపేర్ చేసి చూడలేం. ఓవర్ హీటింగ్ అనేది కొన్ని సందర్భాల్లో వేడి ఉష్ణోగ్రతల కారణంగా తెలత్తవచ్చు. ల్యాప్‌టాప్ నిరంతరం కూల్‌గా ఉండాలంటే లోపల పేరుకుపోయే దుమ్మును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుండాలి. ల్యాప్‌టాప్‌లో పరిమితికి మించిన సాఫ్ట్‌వేర్ యాప్స్ ఉన్నా హీటింగ్ సమస్యలు తప్పవు. ల్యాప్ టాప్ కెపాసిటీని బట్టే యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవటం మంచిది. ప్‌టాప్‌ను నిరంతరం కూల్‌గా ఉంచేందుకు టేబుల్ ఫ్యాన్ సదుపాయంతో కూడిన అనేక కూలింగ్ ప్యాడ్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి.

హార్డ్‌వేర్ ఫెయిల్ అవ్వటం వల్ల...

ల్యాప్‌టాప్‌లోని హార్డ్‌వేర్ ఫెయిల్ అవ్వటం వల్ల కూడా shut-down సమస్యలు తలెత్తే అవకావముంది. మీ పీసీ తరచూ షట్-డౌన్ అవుతున్నట్లయితే ర్యామ్, సీపీయూ, మథర్‌బోర్డ్, పవర్ సప్లై ఇంకా వీడియో కార్డులను చెక్ చేయండి. వీటిలో ఎక్కడైనా సమస్య ఉన్నట్లయితే ఆ భాగాన్ని మార్చవల్సి ఉంటుంది.

బ్యాటరీ సమస్య వల్ల కూడా..

బ్యాటరీ సమస్య వల్ల కూడా ల్యాప్‌టాప్‌లు తరచూ shut-down అయ్యే ప్రమాదముంది. కాబట్టి బ్యాటరీని కూడా చెక్ చేయటం మంచిది. ఛార్జర్ లోపం వల్ల కూడా ర్యాండమ్ షట్-డౌన్ సమస్యలు ల్యాప్‌టాప్‌లను వేధించే అవకాశముంది. కాబట్టి మీ ల్యాపీకి సంబంధించిన ఛార్జర్ సక్రమంగా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవటం మంచిది.

వైరస్ కారణంగా...

వైరస్ కారణంగా కూడా ల్యాప్‌టాప్‌లు తరచూ shut-down సమస్యను ఎదుర్కొనే ప్రమాదముంది. మీ ల్యాపీలో వైరస్‌లు ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించే ప్రయత్నం చేయండి. సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What could cause your laptop to shut-down randomly. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot