క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి..?

Posted By:

మారుతున్న నాగరికతలకు అనుగుణంగా సమాచార సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్, కంప్యూటింగ్ ప్రాధాన్యతను మరింత విస్తరింపచేసింది. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చిన కాన్సెప్టే ‘క్లౌడ్ కంప్యూటింగ్'.

క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి..?

క్లౌడ్ అంటే మేఘం, మేఘాలు నీటిని సమీకరించి ఎక్కువ ప్రదేశంలో ఒకే సారి వర్షాలు కురిపిస్తాయో అదే తరహాలో ఒకే చోటు నుంచి కావల్సిన అప్లికేషన్‌లు ఇంకా ఆన్‌లైన్ డేటా స్టోరేజ్‌ను క్లయింట్‌లకు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అందిస్తారు.

క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు ఏ విధమైన పరిధిలు లేవు, ఎటువంటి సర్వీసులనైనా అందిస్తుంది. అప్లికేషన్‌లు మొదలుకుని  సాఫ్ట్‌వేర్‌ల వరకు క్లౌడ్ కంప్యూటింగ్‌లో సులువుగా లభ్యమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ గుర్తించి క్లుప్తంగా చెప్పాలంటే ఆయా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలనందించే సంస్థలు తాము ఏర్పాటు చేసిన  ప్రత్యేకమైన వెబ్ సర్వర్ల ద్వారా క్లయింట్‌కు కావల్సిన అప్లికేషన్స్ ఇంకా డేడా స్టోరేజ్‌ను అందిస్తాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో భాగంగా క్లయింట్ స్టోర్ చేసిన డేటా మొత్తం ఒక వెబ్ సర్వర్‌లో స్టోరేజ్ కాబడి ఉంటుంది.

అంటే క్లయింట్ వినియోగించిన కంప్యూటర్‌లో ఏ విధమైన డేటా ఇంకా అప్లికేషన్స్ ఉండవు. కేవలం డివైస్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా  క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసును అందించే సంస్థ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. క్లయింట్ ప్రతిసారీ నేరుగా క్లౌడ్ కంప్యూటింగ్‌లోకి లాగినైన క్లౌడ్ సర్వర్ల నుంచి తనుకు కావల్సి అప్లికేషన్స్ ఇంకా డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ మొత్తం విధానాన్నే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు.

క్లౌడ్ కంప్యూటింగ్‌ను వినియోగంచడం వల్ల సాఫ్ట్‌వేర్, క్రాష్, డేటా‌లాస్ వంటి ప్రమాదాలు ఉండవు. అంతేకాదు, క్లయింట్ వినియోగించే డివైస్ కూడా వేగవంతంగా పని చేస్తుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
What is Cloud Computing..?. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot