ఊరించి... ఉసూరుమనిపించటమంటే ఇదేనా..?

Posted By: Super

ఊరించి... ఉసూరుమనిపించటమంటే ఇదేనా..?

 

తక్కువ ధరకే టాబ్లెట్ కంప్యూటర్ అంటూ ముందుకొచ్చిన సంస్థలు ఆకాష్  అదేవిధంగా బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఊరించి.. ఉసూరుమనిపిస్తున్నాయి. నిర్ణీత సమయంలో ఈ డివైజ్‌లు రిటైలింగ్ మార్కెట్లోకి రావల్సి ఉంది. ఈ ప్రక్రియా కాస్తా జాప్యం కావటంతో  పలువురు అసహనానికి లోనవుతున్నారు. వివరాల్లోకి వెళితే  ఆకాష్ పీసీని డేటావిండ్ సంస్థ రూపొందిస్తుండగా,  బీఎస్ఎన్ఎల్ టాబ్లెట్‌ను పాన్‌టెల్ టెక్నాలజీస్ డిజైన్ చేస్త్తుంది. ఆకాష్ విలువ రూ.2,500గా సబ్సిడీ ధర పోనూ విద్యార్థులకు 1250లకు లభ్యమవుతుంది. రిటైల్ మార్కెట్లో ఈ డివైజ్ 2011 నవంబర్ నుంచి అందుబాటులో లేదు. ఇక బిఎస్ఎన్ఎల్  అందిస్తున్న పెంటా IS701R ధర రూ.3,499. మార్చి 5 నుంచి ఈ డివైజ్  లభ్యం కావల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇది సాధ్యపడలేదు. ముందుగానే ఆన్‌లైన్ బుకింగ్‌లను ఆహ్వానించిన ఈ రెండు సంస్థలు డెలివరీ గడువు ముగుస్తున్నా పంపిణి ప్రక్రియ ప్రారంభించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot