ఇ-మెయిల్ అంటే ఏంటి..?

Posted By:

ఇంటర్నెట్ పరిభాషలో ఇ-మెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ (Electronic Mail) అని అర్థం. ఇంటర్నెట్ అందుబాటులోని కాలంలో సమాచారాన్ని సాంప్రాదాయ పోస్టల్ పద్ధతి ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసేవారు. కమ్యూనికేషన్ ప్రపంచంలో చోటు చేసుకున్న విప్లవాత్మక కారణాలతో సమాచారాన్సి స్టేషనరీ పద్ధితిలో కాకుండా డిజిటల్ కమ్యూనికేషన్ పద్ధతిలో క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయగలుతున్నాం. ఇ-మెయిల్‌ను ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అయితే మీరు పంపే ఇ-మెయిల్‌కు సంబంధించి నిర్ణీత వ్యక్తి లేదా సంస్థకు చెందిన ఇ-మెయిల్ ఐడీ ఖచ్చితంగా ఉండాలి.

 ఇ-మెయిల్ అంటే ఏంటి..?

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఇ-మెయిల్ ద్వారా కేవలం అక్షరాలతో కూడిన సందేశాలే కాదు కార్టూన్స్, వాల్ పేపర్స్, వీడియో ఫైల్స్, ట్యూన్స్ ఇలా అనేక రకాలైన డేటాను పంపవచ్చు. పురాతన పోస్టల్ విధానలతో పోలిస్తే ఇ-మెయిల్ సమాచార చేరవేతను మరింత సులభతరం చేసింది. ఇ-మెయిల్‌లోని మూడు ప్రత్యేకమైన విశిష్టతలను ఇప్పుడు తెలుసుకుందాం....

వేగవంతమైన ట్రాన్స్‌ఫర్:

పోస్టల్ పద్ధతి ద్వారా సమాచారాన్ని వేరొక వ్యక్తికి చేరవేయాలంటే చాలా సమయం అమయసరమైతే , ఇ-మెయిల్ ద్వారా ఆ పని క్షణాల్లో పూర్తి అవుతుంది.

ప్రపంచంలో ఎక్కడికైనా:

ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా ఇ-మెయిల్‌ను పంపవచ్చు. ఇందుకు అయ్యే ఖర్చుకూడా నామమాత్రమే.

బోలెడన్ని సదుపాయాలు:

పోస్టల్ పద్ధతి ద్వారా సమాచారాన్ని మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయగలం. కాని, ఇ-మెయిల్ ద్వారా అక్షరాలతో కూడిన సందేశాలే కాదు కార్టూన్స్, వాల్ పేపర్స్, వీడియో ఫైల్స్, ట్యూన్స్ ఇలా అనేక రకాలైన డేటాను పంపవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot