విండోస్ 10లో కొత్త ఫీచర్, Focus Assist ఎలా పొందాలో తెలుసుకోండి

|

మీరు మీ సిస్టం లో గేమ్ ఆడుతున్నప్పుడు అలాగే ఆ గేమ్ రసవత్తరంగా సాగుతున్నప్పుడు మధ్యలో ఏదైనా మెసేజ్ వస్తే చాలా చిరాకు అనిపిస్తుంటుంది కదా. గేమ్ ఆడే మధ్యలో ఈ message box pop up కనిపిస్తే గేమ్ మీద మూడ్ పోతుంది. అయితే దీనిపై మీరు నిరాశ పడకుండా విండోస్ 1oలో Focus Assist పేరుతో ఓ కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కంప్యూటర్లో గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే నోటిఫికషన్లను ఆఫ్ చేసుకోవచ్చు. అయితే మీరు కొన్ని గంటల పాటు అంతరాయం లేకుండా ఉండేదానికి Quiet Hoursలో first Do Not Disturb ఫీచర్ ఉన్నప్పటికీ ఈ కొత్త ఫీచర్ లో మీరు కస్టమైజ్ ని కూడా allows చేసుకునే సౌకర్యం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ ఫీచర్ Quiet Hours కన్నా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. పూర్తి వివరాల్లోకెళితే..

 
విండోస్ 10లో కొత్త ఫీచర్, Focus Assist ఎలా పొందాలో తెలుసుకోండి

Enabling Focus Assist
మీరు Focus Assist ఫీచర్ ఎప్పుడైనా turned on చేసినప్పుడు నోటిఫికేషన్లు మీకు కనపడకుండా వాటిని దాచేస్తుంది. మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే నోటిఫికేషన్ సెంటర్ ఐకాన్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. అక్కడ మీరు scroll down చేసినప్పుడు మీకు Priority Only, Alarms Only అనే ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిలో మీరు మీ ప్రయారిటీని బట్టి సెలక్ట్ చేసుకోవచ్చు.మీరు ఏదైనా సెలక్ట్ చేసుకున్నప్పుడు అలాగే మీరే దేనికి ప్రయారీటి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరు సెట్టింగ్స్ లో సెట్ చేసుకోవాలి. మరో ఆప్సన్ "Off" or "On" అక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని కూడా మీరు నోటిఫికేషన్ సెంటర్లో కాని లేక Windows+A ఉపయోగిస్తున్నప్పుడు కాని యాక్సెస్ చేసుకోవచ్చు.

ఒక వేళ మీరు దాన్నివెతకడంలో ఫెయిల్ అయితే మీరు ఏం చేయాలనే దానిపై మరికొన్ని ఆప్సన్ల ద్వారా దాన్ని సాధించుకోవచ్చు.ముందుగా మీరు సెట్టింగ్స్ యాప్ లో కెళ్లి అక్కడ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. అక్కడ మీరు Focus Assistని ఓపెన్ చేసి మీరు టర్న్ ఆఫ్ అలాగే టర్న్ ఆన్ చేయాలనుకున్నవి చేయవచ్చు.

256 జిబి స్టోరేజ్ కెపాసిటితో కొత్త స్మార్ట్‌ఫోన్‌,ధర ఫీచర్ల వివరాలు256 జిబి స్టోరేజ్ కెపాసిటితో కొత్త స్మార్ట్‌ఫోన్‌,ధర ఫీచర్ల వివరాలు

అక్కడ మీకు మూడు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. వాటిలో మీరు ఏది సెట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.మూడు ఆప్సన్లు ఏంటంటే..
1)"Off"
2)"Priority Only"
3)"Alarms Only" వీటిల్లో నచ్చినది సెలక్ట్ చేసుకోవచ్చు.

2)Configuring the Priority List
మీరు ఏ యాప్స్ ని అసైన్ చేయాలనుకుంటున్నారో వాటిని మాత్రమే సెలక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ Focus Assist సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తరువాత అక్కడ కనిపించే యాప్స్ లిస్ట్ లో మీకు మీ ప్రయారిటీ లిస్ట్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రయారిటీ కాంటాక్ట్స్ ని సెలక్ట్ చేసుకునే ఆప్సన్ కూడా ఉంది.అక్కడ కనిపించే My People ఫీచర్ ద్వారా మీరు కాంటాక్ట్ లిస్ట్ ని సెలక్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది. మిమ్మల్ని యాప్స్ ద్వారా ఎవరు కాంటాక్ట్ అవుతున్నారో వారు ప్రయారిటీ లిస్ట్ లో ఉంటారు వారి నుండి మీకు మెసేజ్ లు వస్తాయి. మీరు డిఫరెంట్ యాప్ ద్వారా సొంతంగా అటెంప్ట్ చేయాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉండదు.

Best Mobiles in India

English summary
What is Focus Assist on Windows 10 and how to use it More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X