డౌన్‌లోడ్ స్పీడ్‌ని డిసైడ్ చేసేది ఈ ఒక్క అక్షరమే, సమగ్ర విశ్లేషణ కథనం

ఇంటర్నెట్ స్పీడ్‌లో KBps, kbpsకు తేడాలేంటో తెలుసా..? పూర్తి సమాచారం తెలుసుకోండి.

By Hazarath
|

మీరు ఇంటర్నెడ్ స్పీడ్‌ను ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా.. అందులో మీరు బాగా పరిశీలనగా చూసినట్లయితే మీకు అక్కడ ఇంత kbps అని అలాగే ఇంత Mbps కనెక్షన్ అని ఇస్తుంటారు. అయితే వాళ్లు ఇచ్చే కనెక్షన్లలో మీరు డౌన్‌లోడ్ స్పీడ్ మాత్రం వారు ఇచ్చినంతగా ఉండదు. మరి తేడా ఎక్కడుందో తెలుసా..అక్కడ క్యాపిటల్ B అలాగే స్మాల్ b అనే అక్షరంలోనే..ఈ తేడాపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

అమెజాన్‌లో డిస్కౌంట్లు మళ్లీ షురూ, రూ. 10 వేల పైనే !అమెజాన్‌లో డిస్కౌంట్లు మళ్లీ షురూ, రూ. 10 వేల పైనే !

KBps, kbps అంటే..

KBps, kbps అంటే..

KBps అంటే కిలో బైట్ ఫర్ సెకండ్ (KB/s) అని అర్థం, అలాగే kbps అంటే కిలో బిట్ ఫర్ సెకండ్ (kbps) అని అర్థం. ఇవే ఇంటర్నల్ డౌన్‌లోడ్ స్పీడును మార్చి వేస్తుంటాయి.

డేటా ట్రాన్స్‌ఫర్‌ని లెక్కించే సమయంలో..

డేటా ట్రాన్స్‌ఫర్‌ని లెక్కించే సమయంలో..

ఎక్కువ browsers, downloaders అలాగే FTP related softwareలు డేటా ట్రాన్స్‌ఫర్ రేట్ల అన్నింటినీ KB/sలో చూపిస్తుంటారు. అయితే ఈ డేటా ట్రాన్స్‌ఫర్ రేట్లని మాత్రం kbpsలో కాలుక్యులేట్ చేస్తుంటారు. కాబట్టి వారు డేటా ట్రాన్స్‌ఫర్‌ని లెక్కించే సమయంలో బ్యాండ్ విడ్త్ రూపంలో లెక్కిస్తారు. దీనినే బిట్స్ రూపంలో అని కూడా అంటారు. మనకు మాత్రం కంప్యూటర్ దీన్ని బైట్స్ లో చూపిస్తుంది. ఇక 0 లేదా 1 అంటే బిట్ అని 8 ఎనిమిది బిట్లు కలిస్తే 1 బైట్ అని మనం చదువుకున్న సంగతి తెలిసిందే.

రెండు విషయాలను ..
 

రెండు విషయాలను ..

మీరు ఎప్పుడైనా ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ నుంచి డేటా ప్లాన్ కొనుగోలు చేసే సమయంలో వారు మీకు రెండు విషయాలను చెబుతారు. అవి బ్యాండ్ విడ్త్, అలాగే download speed. వాటిని మనం కాలుక్యులేట్ చేసుకుంటే మనకు అసలు ఎంత స్పీడ్ అనేది తెలుస్తుంది.

ఉదాహరణకు..

ఉదాహరణకు..

ఉదాహరణకు 256 kbps కనెక్షన్ అంటే 32 kBps (256/8 = 32) కనెక్షన్ అన్నమాట.. 512 kbps అంటే 64 kBps కనెక్షన్.. అలాగే 1Mbps అంటే 128 KBPS... అలా లెక్కించుకోవాలి... ఇక కనెక్షన్ స్పీడ్ ను bps (బిట్స్ పర్ సెకన్ ) అని కొలుస్తారు.. అలాగే మెమరీని bits గా కొలుస్తారు....

మరొక ఉదాహరణ ఏంటంటే

మరొక ఉదాహరణ ఏంటంటే

మరొక ఉదాహరణ ఏంటంటే మీరు 512 kbps plan తీసుకున్నారనుకోండి. దీన్ని ఎలా గుణించాలో చూద్దాం. 1కెబి అంటే 1000 బిట్ అని అర్థం.
కాబట్టి 512kb=512kb*1000bit=512000bit
8 బిట్ 1 బైట్ కాబట్టి 512000bit=512000bit/8=64000byte
1024 బైట్ ఒక 1kilobyte కాబట్టి 64000byte=64000byte/1024=62.5 KB
ఇప్పుడు ఫైనల్‌ 512 kbps కనెక్షన్‌లో 62.5 KB/s speedని పొందుతారు.
మీరు మీ ప్లాన్ ని ఇలా కూడా లెక్కించుకోవచ్చు. Download Speed in KBPS = {(Kbps value*1000) /8)} / 1024, Or Download Speed = (Bandwidth / 8)

మెమొరీ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి..?

మెమొరీ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి..?

bit bit 0 or 1
1byte B 8 bits
1kibibit Kibit 1024 bits
1kilobit kbit 1000 bits
1kibibyte (binary) KiB 1024 bytes
1kilobyte (decimal) kB 1000 bytes
1megabit Mbit 1000 kilobits
1mebibyte (binary) MiB 1024 kibibytes
1megabyte (decimal) MB 1000 kilobytes
1gigabit Gbit 1000 megabits
1gibibyte (binary) GiB 1024 mebibytes
1gigabyte (decimal) GB 1000 megabytes
1terabit Tbit 1000 gigabits
1tebibyte (binary) TiB 1024 gibibytes
1terabyte (decimal) TB 1000 gigabytes
1petabit Pbit 1000 terabits
1pebibyte (binary) PiB 1024 tebibytes
1petabyte (decimal) PB 1000 terabytes
1exabit Ebit 1000 petabits
1exbibyte (binary) EiB 1024 pebibytes
1exabyte (decimal) EB 1000 petabytes

Best Mobiles in India

English summary
What is the difference between KBps and kbps? Read more at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X