బిజినెస్ అవసరాల కోసం డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను కొనుగోలు చేస్తున్నారా..?

|

మార్కెట్లోకి ఇబ్బిడి ముబ్బిడిగా పుట్టుకొస్తన్న కొత్త కంప్యూటర్ మోడల్స్ యూజర్ ఎంపికను మరింత క్లిష్టతరం చేసేస్తున్నాయి. డజన్ల కొద్దీ మోడళ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఏ మోడల్ పీసీని ఎంపిక చేసుకోవాలని అనేదాని పై యూజర్లు తర్జనభర్జన పడిపోతున్నారు. ముఖ్యంగా హోమ్ అలానే బిజినెస్ అవసరాల నిమిత్తం కొనుగోలు చేసే కంప్యూటర్లలో సైజ్, స్పీడ్, సోర్స్, ధర అనేవి చాలా కీలకం. వీటి పై ఖచ్చితమైన అవగాహన ఉన్నట్లయితే బెస్ట్ క్వాలిటీ డివైస్ మీ సొంతమవుతుంది.

 

సైజు విషయానికొస్తే..

సైజు విషయానికొస్తే..

హోమ్ లేదా బిజినెస్ అవసరాలకు పెద్ద సైజు డెస్క్‌టాప్ కంప్యూటర్లను బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించుకున్నప్పటికి రిపేర్ చేసేందుకు చాలా అనువుగా ఉంటాయి. వీటి పనితీరును మరింతగా మెరుగుపరుచుకునేందుకు సెకండరీ హార్డ్‌డ్రైవ్‌తో పాటు గ్రాఫిక్ కార్డులను యాడ్ చేసుకునే వీలుంటుంది.

స్పీడు విషయానికొస్తే...

స్పీడు విషయానికొస్తే...

ఇక స్పీడ్ విషయానికి వచ్చేసరికి Intel Core i5-7400 ప్రాసెసర్‌తో వచ్చే కంప్యూటర్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా బెస్ట్ క్వాలిటీ పనితీరును ఆస్వాదించవచ్చు. బడ్జెట్ గురించి ఆలోచించే వాళ్లు Core i3-7100 లేదా Intel Pentium G4560 చిప్‌సెట్‌లతో కూడిన సీపీయూలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంపిక చేసుకునే డెస్క్‌టాప్ పీసీలో మినిమమ్ 8జీబి ర్యామ్ ఉండాలి.

డెల్, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్‌లకు మంచి గిరాకీ
 

డెల్, హెచ్‌పీ, లెనోవో బ్రాండ్‌లకు మంచి గిరాకీ

యూకే వంటి ప్రముఖ దేశాల్లో కొత్త డెస్క్ పీసీలను కొనుగోలు చేయవల్సి వస్తే డెల్, హెచ్‌పీ, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్‌లను ఆశ్రయిస్తున్నారు. వీటిని దాదాపుగా ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారానే కొనుగోలు చేయటం జరుగుతోంది. ఈ డివైస్‌లను కొనుగోలు చేసేందుకు మీరు ఆన్‌లైన్ విధానాన్ని ఎంపిక చేసుకోవటం ద్వారా కావల్సిన కాన్ఫిగరేషన్‌ను సెలక్ట్ చేసుకునే వీలుంటుంది.

Dell డెస్క్‌టాప్ పీసీ కోసం చూస్తున్నారా..?

Dell డెస్క్‌టాప్ పీసీ కోసం చూస్తున్నారా..?

మీరు డెల్ బ్రాండెడ్ డెస్క్‌టాప్ కంప్యూటర్ కోసం చూస్తున్నట్లయితే Inspiron 3668 మోడల్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. Core i5-7400 చిప్‌సెట్, 8జీబి ర్యామ్, Nvidia GeForce GT 1030 గ్రాఫిక్ కార్డ్ (2జీబి మెమురీతో), 128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్, 1TB హార్డ్‌డ్రైవ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ డివైస్‌లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఈ సీపీయూ ధర రూ.70,960గా ఉంది. ఈ డివైస్ పై మూడు సంవత్సరాల అదనపు ఆన్‌సైట్ వారంటీ సర్వీసును మీరు కోరుకుంటున్నట్లయితే అదనంగా రూ.7000 వరకు చెల్లించాల్సి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌తో వొడాఫోన్‌ జట్టు, అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు !ఫ్లిప్‌కార్ట్‌తో వొడాఫోన్‌ జట్టు, అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు !

ఐ3 వర్షన్‌లోనూ Inspiron 3668..

ఐ3 వర్షన్‌లోనూ Inspiron 3668..

డెల్ తన Inspiron 3668 మోడల్ డెస్క్‌టాప్ పీసీని i3-7100 చిప్‌సెట్‌తోనూ విక్రయిస్తోంది. ఈ సీపీయూలో i3-7100 చిప్‌సెట్‌తో పాటు 8జీబి ర్యామ్ ఇంకా 1టీబీ హార్డ్‌డ్రైవ్‌లు ఉన్నాయి. SSD స్టోరేజ్ అందుబాటులో ఉండదు. గ్రాఫిక్ కార్డును కొద్ది మేరకే ఎక్స్‌ప్యాండ్ చేసుకునే వీలుంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ డివైస్ ధర రూ.50,000లోపు ఉంది.

HP Pavilion 570-p058na మోడల్..

HP Pavilion 570-p058na మోడల్..

ఒకవేళ మీరు హెచ్‌పీ బ్రాండ్ డెస్క్‌టాప్ పీసీ కోసం చూస్తున్నట్లయితే HP Pavilion 570-p058na బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. Core i5-7400 చిప్‌సెట్, 8జీబి ర్యామ్, AMD Radeon R5 435 గ్రాఫిక్స్ కార్డ్, 128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్, 3TB హార్డ్‌డ్రైవ్ వంటి ఫీచర్స్ ఈ పీసీలో ఉన్నాయి. ధర రూ.41,195 (యూకే కరెన్సీలో). డెల్ Inspiron 3668 మోడల్‌లో నిక్షిప్తం చేసిన Nvidia GeForce GT 1030 గ్రాఫిక్ కార్డుతో కంపేర్ చేసినట్లయితే హెచ్‌పి మోడల్‌లోని AMD Radeon R5 435 గ్రాఫిక్స్ కార్డ్ కొంత వీక్ అనిపిస్తుంది.

Ideacentre 510-15IKL...

Ideacentre 510-15IKL...

ఇంచుమించుగా ఇదే బడ్జెట్‌లో లెనోవో డెస్క్‌టాప్ పీసీ కోసం మీరు చూస్తున్నట్లయితే Ideacentre 510-15IKL మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ డివైస్‌లో 2TB హార్డ్ డ్రైవ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. గ్రాఫిక్స్ కార్డ్ సదుపాయం ఉండదు.

Best Mobiles in India

English summary
Buying a new desktop PC is one of today’s simpler computer problems. The main decisions are about size, speed, source and price...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X