మన 'ఆకాష్' అంటే అంత అలుసా..?

Posted By: Staff

మన 'ఆకాష్' అంటే అంత అలుసా..?

 

లాస్ వేగాస్‌లో జరిగిన కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)లో అత్యాధునికమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులను చూసి కస్టమర్స్ ఆనందించారు. హెచ్‌పి, ఇంటెల్ త్వరలో విడుదల చేయనున్న సెన్సిటివ్ ల్యాప్‌ట్యాప్స్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, సోనీ విడుదల చేసిన PS4 ప్రత్యేక ఆకర్షణగా అభిమానులను ఆలరించాయి. వీటితో పోటీ పడడానికి మేమేన్నా తక్కువ తిన్నామా అంటూ హువాయ్ అతి తక్కువ మందం కలిగిన స్మార్ట్ ఫోన్, లెనోవా టాబ్లెట్ నిలిచాయి.

విడుదల సంధర్బంగా ప్రపంచం జనాభా దృష్ఠిని ఆకర్షించిన ప్రపంచపు అతి చిన్న టాబ్లెట్ 'ఆకాష్' మాత్రం సీఈఎస్‌లో ఏమంత ఆదరణకు మాత్రం నోచుకోలేక పోయింది. డైటావిండ్ వైస్ ప్రెసిడెంట్ విజేంద్ర కె గుప్తా సీఈఎస్‌లో మాట్లాడుతూ ఆకాష్ ఆప్ గ్రేడ్ వర్సన్ ‘యూబీస్లేట్ 7’ని సీఈఎస్‌లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దీని గురించి మాత్రం ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలను విశ్లేషించగా..

1.ఆకాష్ టాబ్లెట్‌ని ఇండియా రూపొందించడం.

2.తక్కువ ధరను కలిగి ఉండడం.

3. మార్కెటింగ్ ద్వారా సరైన ప్రాముఖ్యతను కల్పించకపోవడం.

సాధారణంగా టెక్నాలజీ రంగంలో ఇండియా తయారు చేసిన ఉత్పత్తులకు ఏమంత పేరు లేని విషయం మనకందరికి తెలిసిందే. అత్యధిక జనాభా కలిగి ఉన్న ఆసియా దేశాలు చైనా, ఇండియాలో కేవలం $35కే ఇది లభించడం విశేషం. ఈ తక్కువ ధరే ఆకాష్ కొంప ముంచిందా..అంటే అవుననే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు.

తక్కువ ధర కలిగిన వస్తువులు నాసిరకంగా ఉంటాయనేది చాలా మంది నమ్మకం. మన ఆకాష్ విదేశాలలో కూడా చాలా తక్కువ ధరకే లభ్యమవుతుండడంతో వారి మనసులో ఆకాష్‌ని నాసిరకంగా తయారు చేసి ఉంటారనేది వారి నమ్మకం. అందుకే విదేశీయులు మన ఆకాష్‌పై పెద్దగా ఆసక్తి చూపించండలేదని బయటి మాట. కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఎక్కవ ఖరీదు కలిగిన లెనోవా బ్రాండ్ ఉత్పత్తులకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తూ నిర్మించిన స్టాల్సే ఇందుకు నిదర్శనం అంటున్నారు.

ఆకాష్ ఫీచ్లర్లు:

* 7 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480 పిక్సల్స్), * ధృడమైన టచ్ సామర్ధ్యం, * ర్యామ్ పరిమాణం 256 ఎంబీ, * 2జీబి ఇంటర్నల్ ఫ్లాష్ మెమరీ, * ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * జీపీఆర్ఎస్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, WLAN,* ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, * ఆండ్రాయిడ్ v2.2 ఫ్రోయో ఆపరేటింగ్ సిస్టం, * 366 MHz కోనెక్సంట్ ప్రాసెసర్, * గ్రాఫిక్ యాక్సిలరేటర్, * బ్యాటరీ బ్యాకప్ 3 గంటలు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting