వికెడ్ లీక్ vs కార్బన్ (లోకల్ వార్)!

Posted By: Staff

వికెడ్ లీక్  vs కార్బన్ (లోకల్ వార్)!

బడ్జెట్ ఫ్రెండ్లీ టాబ్లెట్ పీసీల విభాగంలో దేశవాళీ బ్రాండ్‌లైన వికెడ్ లీక్, కార్బన్‌ల మధ్య పోటీ వాతవరణం నెలకొంది. అక్టోబర్ 14న మార్కెట్లో విడుదల కాబోతున్న వికిడ్‌లీక్ సరికొత్త టాబ్లెట్ ‘వామ్మీ డిజైర్’ ఆండ్రాయిడ్ లేటెస్గ్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘జెల్లీబీన్’పై రన్ అవుతుంది. ధర రూ.6,499. మరో వైపు కార్బన్ ‘స్మార్ట్ ట్యాబ్ 2’పేరుతో సరికొత్త టాబ్లెట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ వోఎస్ ఆధారితంగా స్పందించే ఈ డివైజ్ ధర రూ.6,999. వీటి స్పెసిఫికేషన్‌ల మధ్య విశ్లేషణ.....

డిస్‌ప్లే:

వామ్మి డిజైర్: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

స్మార్ట్ ట్యాబ్ 2: 7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్, రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

ప్రాసెసర్:

వామ్మి డిజైర్: 1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ఆర్మ్‌కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్,

స్మార్ట్ ట్యాబ్ 2: 1.2గిగాహెడ్జ్ ఎక్స్‌బరస్ట్ ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం:

వామ్మి డిజైర్: ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,

స్మార్ట్ ట్యాబ్ 2: ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా:

వామ్మి డిజైర్: 0.3 మెగా పిక్సల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా,

స్మార్ట్ ట్యాబ్ 2: 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

స్టోరేజ్:

వామ్మి డిజైర్: 8జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

స్మార్ట్ ట్యాబ్ 2: 4జీబి ఇంటర్నల్ మెమెరీ, 512 ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

వామ్మి డిజైర్: వై-ఫై 802.11 b/g/n, 3జీ వయా డాంగిల్,

స్మార్ట్ ట్యాబ్ 2: వై-ఫై, బ్లూటూత్, 3జీ వయా డాంగిల్,

బ్యాటరీ:

వామ్మి డిజైర్: 3000ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

స్మార్ట్ ట్యాబ్ 2: 3700ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (బ్యాకప్ వివరాలు తెలియాల్సి ఉంది),

ధర:

వామ్మి డిజైర్: రూ.6,499,

స్మార్ట్ ట్యాబ్ 2: రూ.6,999.

తీర్పు:

ఇంచుమించు ధరల్లో లభ్యమవుతున్న ఈ కంప్యూటింగ్ డివైజ్‌లు ఆకట్టకునే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఆపరేటింగ్ సిస్టం విషయంలో వీటి మధ్య తేడాలను గమనించవచ్చు. వామ్మి డిజైర్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ పై రన్ అవుతుండగా, స్మార్ట్ ట్యాబ్ 2 ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ పై రన్ అవుతుంది.

ఆడోబ్ ఫ్లాష్ 11.ఎక్స్, వర్డ్, ఎక్సీల్, పవర్ పాయింట్, పీడీఎఫ్ డాక్యుమెంట్స్, 3డీ గేమ్స్ వంటి ప్రత్యేకతలు వామ్మి డిజైర్‌లో పొందుపరిచారు. మరో వైపు స్మార్ట్ ట్యాబ్ 2, గేమ్స్, నైంబజ్, ఫేస్‌బుక్, స్వైప్ ఫీచర్, యాహూ సెర్చ్ ఇంజన్, గూగుల్ సెర్చ్ ఇంజన్,

నైట్ సర్ఫింగ్ మోడ్, వాట్సా ఆప్ మెసెంజర్, జస్ట్ డయిల్ సెర్చ్ ఇంజన్, ఆటో స్పెల్ చెక్, కరెక్షన్ ఫీచర్, పికాసా, ఎంఎస్ఎన్, ట్విట్టర్, ఫ్లిక్కర్, గూగుల్ టాక్, ఐబీబో, వికీపీడియా, పేటీఎమ్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది.

ఎక్కువ ఫీచర్లు అదేవిధంగా మన్నికైన కెమెరా ఆప్షన్‌ను కోరుకునే వారికి కార్బన్ స్మార్ట్ ట్యాబ్ 2 ఉత్తమ ఎంపిక. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అదేవిధంగా వేగవంతమైన ప్రాసెసింగ్ అనుభూతులను కోరుకునే వారికి వామ్మి డిజైర్ బెస్ట్ చాయిస్.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot