ఆగస్టు 30న గ్రాండ్ రిలీజ్!

Posted By: Staff

ఆగస్టు 30న గ్రాండ్ రిలీజ్!

దేశీయ టెక్నాలజీ సంస్థ వికెడ్ లీక్ (Wicked Leak) ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించు సరికొత్త ఫాబ్లెట్‌ను ఆవిష్కరించింది. వామ్మీ నోట్ (Wammy Note)గా విడుదల కాబోతున్న ఈ బహుళఉపయోగకర గ్యాడ్జెట్ ధర రూ.11,000. ఆగస్టు 30 నుంచి మార్కెట్లో లభ్యంకానుంది. ఈ ఫాబ్లెట్ ఆవిష్కరణ సందర్భంగా కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ వచ్చే సెప్టంబర్ నాటికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆధారితంగా స్పందించే మూడు సరికొత్త టాబ్లెట్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. వామ్మీ 7, వామ్మీ ఇతోస్, వామ్మీ ప్లస్ మోడళ్లలో ఈ జెల్లీబీన్ టాబ్లెట్లు విడుదలవుతాయి.

వామ్మీ నోట్ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,

5 అంగుళాల హైడెఫినిషన్ టచ్ స్ర్కీన్చ

డిస్ ప్లే రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్,

1గిగాహెర్జ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

1.3మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా,

2500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (స్టాండ్ బై 260 గంటలు, టాక్ టైమ్ 8 గంటలు),

ధర రూ. 11,000.

వామ్మీ నోట్ ఫాబ్లెట్, ఆగస్టు 30 నుంచి వికెడ్ లీక్ అధికారిక వెబ్ సైట్ ద్వారా లభ్యం కానుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot