రాకింగ్ ఇంకా షాకింగ్ ...త్వరలో!

ప్రముఖ టాబ్లెట్ కంప్యూటర్ల తయారీ సంస్థ ‘వైకిడ్ లీక్’ రెండు సరికొత్త టాబ్లెట్ పీసీలతో మార్కెట్ ముందుకు రాబోతుంది. ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్’ పై స్పందించే ఈ టాబ్లెట్ పీసీల పేర్లు ‘వామ్మీ డిజైర్’ ఇంకా ‘వామ్మీ అతినా’. వీటిలో మొదటిది 7 అంగుళాల స్ర్కీన్ సామర్ధ్యాన్ని కలిగి ఉండగా రెండవది 9.7 అంగుళాల స్ర్కీన్‌ను కలిగి ఉంటుంది.
వామ్మీ డిజైర్ ఫీచర్లు:
7 అంగుళాల కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్.
1జీబి డీడీఆర్3 ర్యామ్,
3జీ వయా డాంగిల్, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్,
హెచ్ డిఎమ్ఐ సపోర్ట్,
3000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.6,499.
వామ్మీ అతినా ఫీచర్లు:
9.7 అంగుళాల ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్,
డ్యూయల్ కోర్ 1.5గిగాహెడ్జ్ ప్రాసెసర్,
1జీబి డీడీఆర్3 ర్యామ్,
3జీ వయా డాంగిల్,
2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరా,
16జీబి ఇన్-బుల్ట్ స్టోరేజ్,
హెచ్‌డిఎమ్ఐ సపోర్ట్,
8000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.13,999.


Click it and Unblock the Notifications








