వైకిడ్‌లీక్ వామ్మీ నోట్: (రివ్యూ)
కనెక్టువిటీ ఇంకా అప్లికేషన్స్:

వామ్మీ నోట్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలిస్తే, ఏర్పాటు చేసిన 3జీ సిమ్‌స్లాట్ సౌలభ్యతతో 3జీ నెట్‌వర్క్ అనుభూతులతో కూడిన మొబైలింగ్‌ను యూజర్ నిర్వహించుకోవచ్చు. మినీ హెచ్‌డిఎమ్ఐ ఫోర్ట్ సౌలభ్యతో ఫాబ్లెట్‌ను హైడెఫినిషన్ పరికరాలకు జత చేసుకోవచ్చు. యూఎస్బీ కనెక్టువిటీ సాయంతో డేటాను వేగంగా ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. వామ్మీనోట్ డ్యూయల్ సిమ్ స్టాట్‌ను కలిగి ఉంది. అంటే ఏక కాలంలో రెండు నెట్‌వర్క్‌ల మధ్య కమ్యూనికేషన్ బంధాలను సాగించవచ్చు. 3జీ హెచ్‌డీపీఏ కనెక్టువిటీ సామర్ధ్యం 3.6 ఎంబీపీఎస్. వాయిస్ కాల్స్ నిర్వహించుకోవచ్చు. వై-పై, బ్లూటూత్ సౌలభ్యత. యూజర్ ఈ ఫాబ్లెట్ కొనుగోలు పై అదనంగా రెండు బ్యాటరీలను పొందవచ్చు.
ఫ్లేస్టోర్ అప్లికేషన్ అదేవిధంగా ఫేస్‌బుక్, జీమెయిల్, ఇన్స్‌టాగ్రామ్, యాంగ్రీ బర్డ్స్ తదితర అప్లికేషన్‌లను ఫాబ్లెట్‌లో ముందుగానే లోడ్ చేశారు. నిక్షిప్తం చేసిన గూగుల్ మ్యాప్ నావిగేషన్ అదేవిధంగా వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లు మన్నికైన పనితీరును ప్రదర్శిస్తాయి. వామ్మీనోట్‌లో పొందుపరిచిన ఇతర ఫీచర్లు.... బుక్, ఈ-మెయిల్, మెసేజింగ్, వీపీఎన్ సర్వీసెస్, గూగుల్ సెర్చ్, ఫ్లాష్ ప్లేయర్, డాక్యుమెంట్స్ టూ గో, వాల్ పేపర్స్, క్యాలెండర్, క్లాక్, టితరింగ్, పోర్టబుల్ హాట్ స్పాట్.


Click it and Unblock the Notifications