ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్స్!

Posted By: Prashanth

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ టాబ్లెట్స్!

 

తక్కువ ధర టాబ్లెట్ కంప్యూటర్లకు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొనటంతో రోజుకో కొత్త మోడల్ పుట్టుకొస్తోంది. వీటిలో ఏ వేరియంట్‌ను ఎంపిక చేసుకోవాలో తెలియక వినియోగదారులు తికమక పడాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. తాజాగా వికిడ్‌లీక్ అనే సంస్థ ‘వామ్మీ సిరీస్ నుంచి మూడు టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. వాటి పేర్లు వామ్మీ 7, వామ్మీ ఇతోస్, వామ్మీ ప్లస్ ఆండ్రాయిడ్ సరికొత్త ఆపరేటింగ్ సిస్లం జెల్లీబీన్‌ను వీటిలో నిక్షిప్తం చేశారు. సెప్టంబర్ చివరి నాటికి ఈ డివైజులు అందుబాటులోకి రానున్నాయి.

వామ్మీ 7 కీలక ఫీచర్లు:

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),

1.2గిగాహెడ్జ్ ఆర్మ్ కార్టెక్స్ ఏ10 ఆల్ విన్నర్ ప్రాసెసర్,

400మెగాహెడ్జ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,

512ఎంబీ ర్యామ్,

ఇంటర్నల్ మెమెరీ 4జీబి,

మైక్రోఎస్డీ స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు,

డాంగిల్ సహాయంతో 3జీ ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

గుగూల్ ప్లే స్టోర్‌లోకి ప్రవేశించే సౌలభ్యత,

హెచ్‌డిఎమ్ఐ కనెక్టువిటీ సౌలభ్యతతో టాబ్లెట్‌ను హై డెఫినిషన్ టీవీలకు అనుసంధానించుకోవచ్చు,

5 గంటల బ్యాకప్ నిచ్చే 3000 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ,

ధర రూ.5,249.

వామ్మీ ఇతోస్ కీలక స్పెసిఫికేషన్ లు:

7 అంగుళాల టచ్ స్ర్కీన్,

మినీ యూఎస్బీ పోర్ట్,

1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

512ఎంబీ ర్యామ్,

4జీబి ఇంటర్నల్ మెమెరీ,

32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ,

మినీ హెచ్ డిఎమ్ఐ,

ధర రూ.8,999.

వామ్మీ ప్లస్ కీలక స్పెసిఫికేషన్‌లు:

7 అంగుళాల 5 పాయింట్ కెపాసిటివ్ టచ్ స్ర్కీన్,

3జీ సిమ్ స్లాట్, వై-ఫై,

జీపీఎస్,

.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

మీనీ హెచ్ డిఎమ్ఐ పోర్ట్,

512 ఎంబీ ర్యామ్,

ధర రూ.11,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot