అదే జరిగితే.. ఆమోజన్ ‘ది కింగ్’..?

By Prashanth
|
Amazon


‘సామ్‌సంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ నోట్ ప్రభంజనం దిశగా దూసుకు వెళుతోంది... త్వరలో విడుదల కాబోతున్న ఆపిల్ కొత్త ఐప్యాడ్ మార్కెట్ వర్గాలో నూతన ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది... ఈ రెండు బ్రాండ్‌లను తలదన్నేలా రీతిలో సెగలు పుట్టించే బ్రాండ్ ఆమోజన్ కిండిల్ ఫైర్ ఓ శక్తివంతమైన గ్యాడ్జెట్‌‌ను రూపొందిస్తుంది. మరీ, ఈ మాహా సంగ్రామంలో ఆమోజన్ తన సవాల్‌ను నిలబెట్టుకుంటుందా..?, ఈ ఏడాదికిగాను ఓ రేంజ్ హిట్లును కైవసం చేసుకోనుందా..?

ఇండస్ట్రీలో టాబ్లెట్ కంప్యూటర్లను తయారు చేసే కంపెనీలు ఎన్ని ఉన్నప్పటికి ఆపిల్ ఐప్యాడ్‌కు పోటినివ్వగల సామర్ధ్యం ఆమోజన్ కిండిల్ పైర్‌కు ఉందని పలువురు భావిస్తున్నారు. ఇందుకు బలమైన కారణం, ఆమోజన్ నుంచి 7 అంగుళాల స్ర్కీన్ పరిమాణంలో విడుదలైన టాబ్లెట్ కంప్యూటర్లు, ఆపిల్ రూపొందించిన టాబ్లెట్ పీసీ ఐప్యాడ్ మినీ మార్కెట్‌ను తగ్గించటంలో కీలకంగా వ్యవహరించాయి.

ఈ నేపధ్యంలో మార్కెట్ పై మరింత పట్టు సాధించే దిశగా ఆమోజన్ పావులు కదుపుతోంది.. ఆపిల్ సరికొత్త ఐప్యాడ్ అదేవిధంగా సామ్‌సంగ్ గెలాక్సీ నోట్‌లను సమర్థవంతంగా ఢీకొనేందుకు 10 అంగుళాల స్ర్కీన్ వేరియంట్‌లో టాబ్లెట్‌ను డిజైన్ చేస్తున్నట్టు ‘డిగిటైమ్స్’ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సైట్ ఉటంకించింది. ఆమోజన్ రూపొందిస్తున్న డివైజ్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్‌లను సెప్టంబర్ చివరి నుంచి ఆహ్వానించే అవకాశముంది. ఈ ఏడాది 30 నుంచి 40 మిలయన్ల టాబ్లెట్ యూనిట్‌లను విక్రయించాలన్న కృతనిశ్చయంలో ఆమోజన్ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది.

టెక్ ప్రంపచానికి కొత్త కబురందింది:

టెక్ ప్రంపచానికి కొత్త కబురందింది. అమెజాన్ కిండిల్ ఫైర్ రూపంలో కేంద్రీక్ళతమైన ఓ ఉప్పెన 2012 మధ్యనాటికి మార్కెట్‌ను తాకనుంది. కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమెజాన్ రెండు వేరు వేరు డిస్‌ప్లే మోడల్స్‌లో టాబ్లెట్ పీసీలను డిజైన్ చేసింది. జూన్, జూలై నాటికి ఈ కంప్యూటింగ్ డివైజ్‌లు మార్కెట్లో లభ్యంకానున్నాయి. ఆమెజాన్ కిండిల్ ఫైర్ 2 నమూనాలో వస్తున్న ఈ గ్యాడ్జెట్ మునుపటి కిండిల్ పైర్‌కు సక్సెసర్. 7, 9 అంగుళాల స్ర్కీన్ సైజులలో వీటిని వ్ళద్ధి చేశారు. వేగవంతమైన కంప్యూటింగ్‌కు దోహదపడే విధంగా ఆధునిక సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను పీసీలలో నిక్షిప్తం చేసినట్లు సమాచారం.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X