ఇండియాలో విండోస్ AI ల్యాప్‌టాప్‌లు విడుదల.. ధర కేవలం రూ.70,000 లోపే!
Windows AI Laptops: ఇండియాలో క్వాల్‌కామ్ అదిరిపోయే స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. దీంతో AI టెక్నాలజీతో పనిచేసే విండోస్ ల్యాప్‌టాప్‌లు సామాన్యులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త AI ల్యాప్‌టాప్‌లను 'కోపైలట్+ PCs' అని పిలుస్తున్నారు, వీటి ధర రూ.70,000 లోపే ఉండనుంది. ఈ సరికొత్త ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన మొదటి కంపెనీ అసుస్. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు, సూపర్ పర్ఫార్మెన్స్‌తో ఈ ల్యాప్‌టాప్‌లు రానున్నాయి.
* స్నాప్‌డ్రాగన్ Xతో AI ల్యాప్‌టాప్స్
స్నాప్‌డ్రాగన్ X ప్రాసెసర్.. ఇది ఒక సంచలనం అనే చెప్పాలి. ఇందులో 8 కోర్లు ఉన్నాయి, ఇది AI పనులను చాలా వేగంగా, సులువుగా చేస్తుంది. ఇంకా ముఖ్యంగా బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొత్త AI ప్రాసెసర్ల జనరేషన్‌లో బ్యాటరీ లైఫ్‌పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు.

ఈ ప్రాసెసర్‌ను ARM టెక్నాలజీతో రూపొందించారు. ఇది రెండు వేరియంట్‌లలో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ X ఎలైట్ మరియు స్నాప్‌డ్రాగన్ X ప్లస్. ఇప్పటికే చేసిన టెస్టుల్లో ఈ ప్రాసెసర్ అదిరిపోయే రిజల్ట్స్ చూపించింది. దీంతో AI పవర్డ్ విండోస్ ల్యాప్‌టాప్‌లు చాలామందికి బెస్ట్ ఛాయిస్ అయ్యేలా ఉన్నాయి.
* AI ల్యాప్‌టాప్‌లకు ఇదే సరైన సమయం
ఇప్పుడు ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ AI ల్యాప్‌టాప్‌లు రావడం కరెక్ట్ టైమింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే విండోస్ 10 సపోర్ట్ ఈ సంవత్సరం చివరలో ఆగిపోతుంది. చాలా పాత ల్యాప్‌టాప్‌లు విండోస్ 11కి ఫ్రీగా అప్‌డేట్ అవ్వడం కూడా కష్టంగా మారింది. అంటే చాలామంది కొత్త ల్యాప్‌టాప్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. అలాంటి వారికి స్నాప్‌డ్రాగన్ X పవర్డ్ ల్యాప్‌టాప్‌లు AI ఫీచర్లతో ఒక మంచి ఆప్షన్.
* అసుస్ వివోబుక్ 16
అసుస్ వివోబుక్ 16 ఈ కొత్త AI ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ల్యాప్‌టాప్స్‌లో ఒకటి. ఇంకా చాలా బ్రాండ్లు కూడా త్వరలోనే ఇలాంటి ల్యాప్‌టాప్‌లను తీసుకురానున్నాయి. దీంతో కస్టమర్లకు చాలా ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఇంతకుముందు బడ్జెట్ విండోస్ ల్యాప్‌టాప్‌లు పర్ఫార్మెన్స్ విషయంలో కాస్త వెనుకబడేవి.
కానీ క్వాల్‌కామ్ మాత్రం ఈసారి ఎఫిషియెన్సీ, పవర్ బ్యాలెన్స్ చేస్తూనే, భవిష్యత్తు టెక్నాలజీ అయిన AI ఫీచర్లను కూడా యాడ్ చేసి మార్కెట్‌ను ఏలాలని చూస్తోంది. ఈ AI ల్యాప్‌టాప్‌లు వినడానికి చాలా ఆసక్తిని రేపుతున్నాయి కానీ, వీటి రియల్-వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
స్నాప్‌డ్రాగన్ X ఎలైట్, ప్లస్ ప్రాసెసర్లు మాత్రం మంచి సమర్థతతో కనిపిస్తున్నాయి. కానీ యూజర్లు మాత్రం ఏ ల్యాప్‌టాప్ తీసుకోవాలనే విషయంలో నిర్ణయానికి వచ్చే ముందు సమగ్రమైన రివ్యూల కోసం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి తక్కువ ధర, AI ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్‌లను అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నవారికి ఒక మంచి ఎంపికగా మారుస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్ తో పాటు ఈ పీసీలో కూడా AI టెక్నాలజీ అందుబాటులోకి వస్తే చాలామంది పనులు మరింత సులభతరం అవుతాయి. తద్వారా వారు తమ రంగాల్లో రాణించవచ్చు.


Click it and Unblock the Notifications








