హైడెఫినిషన్ కంప్యూటర్ రూ.9,999కే!

Posted By: Prashanth

హైడెఫినిషన్ కంప్యూటర్ రూ.9,999కే!

 

ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల తయారీ సంస్థ విష్‌టెల్ (WishTel) గత నెలలో ‘ఐరా థింగ్ 2’ పేరుతో టాబ్లెట్ పీసీని విడుదల చేసిన విషయం తెలసిందే. తాజాగా ఈ సంస్థ మరో సరికొత్త హైడెఫినిషన్ టాబ్లెట్ పీసీని ఆఫర్ చేస్తోంది. పేరు ‘ఐరా కామిట్ హైడెఫినిషన్’. ధర రూ.9,999. స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే...

- 10.1 అంగుళాల హైడెఫినిషన్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 1024పిక్సల్స్),

- ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

- 1 .2గిగాహెర్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

- 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

- 1జీబి ర్యామ్,

- 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

- 3జీ సపోర్ట్ వయా డాంగిల్,

- వై-ఫై 802.11 b/g,

- మినీ హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

- మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్,

- 3.5ఎమఎమ్ ఆడియో జాక్,

- 5500ఎమ్ఏహెచ్ బ్యాటరీ (బ్రౌజింగ్ టైమ్ 5 నుంచి 6 గంటలు).

టాబ్లెట్‌లో అదనంగా 1000 గంటల ఎడ్యుకేషనల్ వీడియో కంటెంట్‌ను లోడ్ చేశారు. ఐఐటీ-జేఈఈ, మెడిడకల్ ఏఐమ్‌పిఎమ్‌టి, క్యాట్, జీఎమ్ఏటి, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్‌లకు సంబంధించి కంటెంట్‌ను ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ద్వారా పొందవచ్చు.

Read In English

విష్‌టెల్ ఐరా టాబ్లెట్ ఫీచర్లు:

7 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 800×480పిక్సల్స్), 800మెగాహెట్జ్ ప్రాసెసింగ్ యూనిట్, 512ఎంబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 2.2, 2.3 ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ఇన్‌బుల్ట్ మెమెరీ, 32జీబి ఎక్సప్యాండబుల్ మెమెరీ వయా మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్, వై-ఫై -802.11 b/g కనెక్టువిటీ, 3జీ డాంగిల్‌ను కనెక్ట్ చేసుకునేందుకు యూఎస్బీ 2.0 పోర్ట్, కార్డ్ రీడర్, హెడ్‌ఫోన్ జాక్, 1.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2200ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.4,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot