విష్‌టెల్ సరికొత్త హైడెఫినిషిన్ టాబ్లెట్ ‘ఐరా ఐకాన్’

By Prashanth
|
Wishtel Ira Icon HD Released


ముంబయ్ ఆధారిత టెక్నాలజీ సంస్థ విష్‌టెల్, ‘ఐరా ఐకాన్’ పేరుతో సిరకొత్త హైడెఫినిషన్ టాబ్లెట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఈ డివైజ్‌ను ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీదారుగా టెక్‌వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

 

కీలక స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ-టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

 

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబకి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: ఇన్-బుల్ట్ 3జీ, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ, ఇన్-బుల్ట్ సిమ్‌స్లాట్ (వీడియో కాలింగ్),

బ్యాటరీ: 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

అదనపు ఫీచర్లు: విష్ లైబ్రరీ, విష్ స్టూడియో, సోషల్ మీడియా అప్లికేషన్స్, ఆఫీస్ సూట్, ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్స్.

కొనుగోలు పై ఆఫర్ చేస్తున్న ఉచిత గిఫ్ట్స్: వైర్‌లెస్ హెడ్‌ఫోన్, యూఎస్బీ కేబుల్, కార్డ్ రీడర్,

ధర: రూ.12,999.

పోటీ: 8 అంగుళాల స్ర్కీన్ వేరయంట్‌లో విడుదలైన విష్‌టెల్ ఐరా ఐకాన్, పాంటెల్ ‘టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్ 802సీ’ 2జీ టాబ్లెట్‌కు గట్టి పోటినివ్వనుంది.

టీ-ప్యాడ్ డబ్ల్యూఎస్ 802సీ స్పెసిఫికేషన్‌లను పరిశీలస్తే... 8 అంగుళాల మల్టీ-టచ్ కెపాసిటివ్ స్ర్కీన్, 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్, మాలీ 400 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం, వీజీఏ ఫ్రెంట్ కెమెరా, సిమ్‌కార్డ్ స్లాట్, 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకనే సౌలభ్యత, మినీ- యూఎస్బీ, హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, వై-ఫై, బ్లూటూత్ కనెక్టువిటీ, 5000ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ధర రూ.8,299. ఈ 2జీ టాబ్లెట్ కొనుగోలు పై బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. సిమ్‌కార్డ్‌తో పాటు 4జీబి డాటాను రెండు నెలల పాటు ఉచితంగా అందిస్తోంది.

Read In English

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X