విష్‌టెల్ సరికొత్త లైనెక్స్ టాబ్లెట్.... రూ.2,800కే ?

Posted By: Prashanth

విష్‌టెల్ సరికొత్త లైనెక్స్ టాబ్లెట్.... రూ.2,800కే ?

 

ముంబయ్ ఆధారంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ విష్‌టెల్ ‘ప్రిత్‌వి’(PrithV) పేరుతో సరికొత్త లైనెక్స్ టాబ్లెట్‌ను ప్రకటించనుంది. ధర అంచనా రూ.2,800. లైనెక్స్ ఆధారంగా స్పందించే ప్రిత్‌వి ప్లాట్‌ఫామ్‌ను టాబ్లెట్స్ ఇంకా నెట్‌బుక్ పీసీలలో ఉపయోగించుకోవచ్చని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్ 85 అంతర్జాతీయ భాషలతో పాటు 23 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. టాబ్లెట్‌లో లోడ్ చేసిన విద్యా సంబంధిత సాఫ్ట్‌‌వేర్‌లు ప్రీ-ప్రైమరీ, టెరిటరీ ఇంకా ఉన్నత విద్యకు సంబంధించి ఉపయుక్తమైన అంశాలను కలిగి ఉంటాయి.

విష్‌టెల్, ‘ఐరా ఐకాన్’ పేరుతో సిరకొత్త హైడెఫినిషన్ టాబ్లెట్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. ధర రూ.12,999. ఈ డివైజ్‌ను ఆపిల్ ఐప్యాడ్‌కు పోటీదారుగా టెక్‌వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

కీలక స్పెసిఫికేషన్‌లు:

డిస్‌ప్లే: 8 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ మల్టీ-టచ్ కెపాసిటివ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్),

ప్రాసెసర్: 1.2గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్,

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్విచ్ ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు),

స్టోరేజ్: 1జీబి ర్యామ్, 8జీబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబకి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: ఇన్-బుల్ట్ 3జీ, వై-పై, బ్లూటూత్, హెచ్‌డిఎమ్ఐ, ఇన్-బుల్ట్ సిమ్‌స్లాట్ (వీడియో కాలింగ్),

బ్యాటరీ: 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీ (6 గంటల బ్యాకప్),

అదనపు ఫీచర్లు: విష్ లైబ్రరీ, విష్ స్టూడియో, సోషల్ మీడియా అప్లికేషన్స్, ఆఫీస్ సూట్, ఎంటర్‌టైన్‌మెంట్ అప్లికేషన్స్.

కొనుగోలు పై ఆఫర్ చేస్తున్న ఉచిత గిఫ్ట్స్: వైర్‌లెస్ హెడ్‌ఫోన్, యూఎస్బీ కేబుల్, కార్డ్ రీడర్,

ధర: రూ.12,999.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot