మన ‘ఆకాష్’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్: సిబల్

Posted By: Super

మన ‘ఆకాష్’కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్: సిబల్

దేశంలో ఇటీవల ఆవిష్కరించిన అత్యంత చౌక టాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’ ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తోందని కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి కపిల్ సిబిల్ బుధవారం ఢీల్లిలో తెలిపారు. యునెస్కో (UNESCO), ప్రపంచ బ్యాంక్ (WORLD BANK) వంటి దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో పాటు అనేక దేశాధినేతలు ఆకాష్ టాబ్లెట్ పీసీల పై ఆసక్తి కనబరుస్తున్నారని సిబల్ వెల్లడించారు.

ఇటీవల ఆమెరికాలో జరిగిన ‘ఇండో-యూఎస్’ ఉన్నత విద్యా సదస్సులో ‘ఆకాశ్ ట్యాబ్లెట్ పీసీ’ని మంత్రి సమక్షంలో ప్రదర్శించారు. భారతీయ చవక గ్యాడ్జెట్ ఆకాష్ ప్రపంచ దేశాలను మరింత ఆకట్టుకుందని, పీసీని మరింత మెరుగుపర్చేందుకు పలు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లు సహకారం అందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

రెండో దశలో ఆకాశ్ టాబ్లెట్ మరింత శక్తివంతమైన ప్రాసెసర్, మన్నికైన టచ్ స్క్రీన్, పటిష్ట బ్యాటరీ వ్యవస్థ కలిగి ఉంటుందని, దీన్ని కేవలం 35 డాలర్లకే అందించగలమని సిబల్ భరోసా వ్యక్తం చేశారు. కేవలం రూ.2,276 ఖరీదుకే ‘ఆకాష్ మొదటి దశ టాబ్లెట్’ను గత నెల 5వ తేదిన సిబిల్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot