విద్యార్థులకు రూ.1100కే ‘ఆకాశ్’ టాబ్లెట్ పీసీ..!!

Posted By: Staff

విద్యార్థులకు రూ.1100కే ‘ఆకాశ్’ టాబ్లెట్ పీసీ..!!

ప్రపంచంలోనే అత్యంత చౌక్ టాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’ ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. విద్యార్థులకు రూ.12,00కే లభించే ఈ పీసీని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబల్ బుధవారం ఆవిష్కరించారు. పన్నులు, రవాణా ఖర్చులు కలుపుకుని ఈ టాబ్లెట్‌ను ప్రభుత్వం రూ.2,276కు కొనుగోలు చేసింది.

అయితే ఈ టాబ్లెట్లను కోనుగోలు చేసే సంస్థలకు 50శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఫలితంగా 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ టాబ్లెట్ పీసీ రూ.1100 నుంచి రూ.1200 మధ్య లభిస్తుంది. సాంకేతికత తోడ్పాటుతో విద్యాభివృద్ధే లక్ష్యంగా ఈ టాబ్లెట్ పీసీలను త్వరలోనే కేంద్రీయ, సాంకేతిక విద్యా సంస్థల్లో పంపిణి చేయునున్నారు.

సాధారణ ప్రజానీకానికి మాత్రం వచ్చే నెల నుంచి ఈ గ్యాడ్జెట్లను రూ.2999కి విక్రయించనున్నారు. క్లుప్తంగా ఆకాశ్ టాబ్లెట్ ఫీచర్లు:

- టాబ్లెట్లలో 3జీ మరియు జీపీఆర్‌ఎస్ కనెక్టువిటీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.
- 7 అంగుళాల టచ్ స్ర్కీన్,
- ఆండ్రాయిడ్ 2.2 ఆపరేటంగ్ వ్యవస్థ,
- 256 ఎంబీ ర్యామ్,
- 366 మెగా హెట్జ్ ప్రాసెసర్,
- 2జీబీ ఇంటర్నల్ మెమరీని ఎక్సటర్నల్ స్లాట్ విధానం ద్వారా 32జీబీకి వృద్ధి చేసుకోవచ్చు.
- 180 నిమిషాల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యం,
- ఈ -బక్స్, మై డెఫినిషన్ వీడియో కంటెంట్, ఆఫీస్ డాక్యుమెంట్స్ తదితర అంశాలను టాబ్లెట్ సపోర్టు చేస్తుంది.
- ఏడాది రిప్లేస్‌మెంట్ వారంటీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot