రెండు వైపులా తాకే తెరతో...గ్రిప్పిటీ డ్యుయల్ స్ర్కీన్ ట్రాన్స్‌పరెంట్ టాబ్లెట్

Posted By:

రెండు వైపులా తాకే తెరతో ఆపరేట్ చేయదగిన ట్రాన్స్‌పరెంట్ డ్యూయల్ స్ర్కీన్ టాబ్లెట్‌ను గ్రిప్పిటీ సంస్థ ఆవిష్కరించింది. ఈ తరహా డివైజ్ ప్రపంచంలో ఇదే మొదిటిది. ఈ డివైజ్ సెమీ ట్రాన్స్‌పరెంట్ సాంకేతికతతో కూడిన 7 అంగుళాల టచ్‌స్ర్కీన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే రిసల్యూషన్ సామర్ధ్యం 800 x 480పిక్సల్స్. వచ్చే సీజన్ నాటికి ఈ టాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

రెండు వైపులా తాకే తెరతో...

డిస్కవరీ న్యూస్ వెల్లడించిన వివరాల మేరకు ఈ టాబ్లెట్ ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన ప్యానల్ వ్యవస్థ మల్టీ టచ్ ఇన్‌పుట్‌ను సపోర్ట్ చేసేదిగా ఉంటుంది. కార్టెక్స్ ఏ8 ప్రాసెసర్ పై డివైజ్ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ప్లాట్‌ఫామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, వై-ఫై, బ్లూటూత్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ట్రాన్స్‌పరెంట్ కంప్యూటింగ్ పరికరంలో ఏర్పాటు చేసారు. గాడ్జెట్‌లో ముందుగానే లోడ్ చేసిన ఐఆర్ బ్లాస్టర్ ఫీచర్ టాబ్లెట్‌ను రిమోట్ కంట్రోల్‌లా మార్చేస్తుంది.

ఈ ఆవిష్కరణ సందర్భంగా గ్రిప్పిటీ టాబ్లెట్ రూపకర్త జాకబ్ ఇచ్‌బామ్ స్పందిస్తూ డివైజ్‌లో ఏర్పాటు చేసిన పాక్షికమైన ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే ఫీచర్ టాబ్లెట్‌కు రెండు వైపులా ఏర్పాటుచేయటంతో టచ్ ఇంటర్ ఫేస్ ఇరువైపులా స్పందిస్తుంది. దింతో టాబ్లెట్‌ను రెండు వైపుల నుంచిఆపరేట్ చేసుకునేందుకు వీలుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో గ్రిప్పిటీ ట్రాన్స్‌పరెంట్ స్ర్కీన్ టాబ్లెట్ ధర 235 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.14,539).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot