తెలుగు యాప్‌లకు భలే క్రేజ్
‘యాప్' దీని పూర్తి పేరు అప్లికేషన్. స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఈ ‘యాప్స్' భలే సుపరిచితం. అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని వివిధ రకాల మొబైల్ ఇంకా డెస్క్‌టాప్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేసే విధంగా లక్షలాది అప్లికేషన్‌లను డెవలపర్లు వృద్థి చేస్తున్నారు.

అప్లికేషన్‌ల రూపకల్పనలో భాష కూడ కీలకం కావటంతో ఉపయుక్తమైన సమాచారంతో ప్రాంతీయ భాషల్లో రూపుదిద్దుకుంటున్న ‘స్మార్ట్' యాప్స్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇక మన తెలుగు విషయానికొస్తే వంటకాలు, ఫిట్నెస్, కథలు, సామెతలు, పొడుపు కథలు, జోక్స్, వంటలు, స్తోత్రాలు, బైబిల్, ఖురాన్ ఇలా అనేక అంశాలకు సంబంధించి వందలాది అప్లికేషన్‌లు మన మాతృ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఉపయుక్తమైన తెలుగు యాప్స్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో విలువైన సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న చిట్టి చిలకమ్మ, చందమామ రావే, చుక్ చుక్ రైలు, తెలుగు స్లేట్, తెలుగు రైమ్స్ వంటి అప్లికేషన్‌లు అచ్చ తెలుగు సంస్కృతిని చిన్నారులకు నేర్పిస్తున్నాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








