ఆపిల్ నుంచి మరో అద్భుతం!

Posted By: Staff

 ఆపిల్ నుంచి మరో అద్భుతం!

 

2012, వరల్డ్ వైడ్ డవలపర్స్ కాన్ఫిరెన్స్ వేదికగా ఆపిల్, ప్రపంచపు అత్యుత్తమ రెటీనా డిస్‌ప్లేతో కూడిన 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోను ఆవిష్కరించిది. రెటీనా డిస్‌ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఫ్లాష్ మెమెరీ వంటి ఉత్తమ స్పెసిఫికేషన్‌లను ఒదిగి ఉన్న ఈ నోట్‌బుక్ స్లిమ్ ఇంకా తక్కువ బరువును కలిగి ఉత్తమ కంప్యూటింగ్ కు తోడ్పడుతుంది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ స్పందిస్తూ ల్యాపీలో పొందుపరిచిన రెటీనా డిస్‌ప్లే వ్యవస్థ  క్లారిటీతో కూడిన క్వాలిటీ శ్రేణి విజువల్ అనుభూతులను చేరువచేస్తుందని తెలిపారు.

15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో రెండు వర్షన్‌లలో లభ్యం కానుంది. వీటిలో మొదటి వర్షన్ 2.3గిగాహెట్జ్ సామర్ద్యం గల ఇంటెల్ కోర్ ఐ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3.3గిగాహెడ్జ్ టర్బో బూస్ట్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. 8జీబి ఇంటర్నల్ మెమెరీ. 256జీబి ఫ్లాష్ మెమరీ ధర రూ.152,900. రెండవ వర్షన్ 2.6 గిగాహెట్జ్ సామర్ద్యం గల ఇంటెల్ కోర్ ఐ7 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3.6గిగాహెడ్జ్ టర్బో బూస్ట్ సౌలభ్యతను కలిగి ఉంటుంది. ధర రూ.192,900.

మ్యాక్ బుక్ ప్రో ఇతర ఫీచర్లను పరశీలిస్తే...

- మ్యాక్ వోఎస్ ఎక్స్ లయోన్ ఆపరేటింగ్ సిస్టం,

-

ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 650ఎమ్ గ్రాఫిక్ యూనిట్,

- యూఎస్బీ పోర్ట్స్ (2),

- తండర్ బోల్ట్ పోర్ట్స్(2),

- హెచ్‌డిఎమ్ఐ పోర్ట్,

- 7 గంటల బ్యాకప్ నిచ్చే బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot