ఐఓఎస్ 8 మొబైల్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రదర్శించిన యాపిల్

Posted By:

శాన్‌ఫ్రాన్సిస్కోలో సోమవారం ప్రారంభమైన యాపిల్ 25వ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిరెన్స్ (డబ్ల్యూడబ్ల్యూడీసీ 2014)లో భాగంగా, కుపర్టినో దిగ్గజం యాపిల్ సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో భాగంగా యాపిల్ ఐఓఎస్ 8 (iOS 8) లేటెస్ట్ వర్షన్ ఐఫోన్, ఐప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు లేటెస్ట్ వర్షన్ ఓఎస్ ఎక్స్ యోసీమైట్ (OS X Yosemite) డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టంను ప్రదర్శించింది. సరికొత్త ఫీచర్లతో ఆవిష్కరించబడిన ఈ రెండు ఆపరేటింగ్ ప్లాట్‌‍‌ఫామ్‌లు గూగుల్ ఆండ్రాయిడ్‌కు సవాల్‌గా నిలవనున్నాయి.

ఐఓఎస్ 8  మొబైల్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రదర్శించిన యాపిల్

ఆధునిక స్మార్ట్ మొబైలింగ్ సాంకేతికతతో రూపకల్పన చేయబడిన ఐఓఎస్ 8 ప్లాట్‌ఫామ్ వేగవంతమైన పనితీరును యూజర్లుకు అందించగలదని యాపిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రెయిగ్ ఫెడిర్గీ స్పష్టం చేసారు. ఐక్లౌడ్ ఫోటో లైబ్రెరీ, న్యూ మెసేజ్ యాప్, క్విక్ టైప్ కీబోర్డ్, హెల్త్ అప్లికేషన్ వంటి ఫీచర్లు ఈ కొత్త వర్షన్ ఆపరేటింగ్ సిస్టంను మరింతగా బలోపేతం చేస్తాయని ఆయన వెల్లడించారు.

మ్యాక్ శ్రేణి కంప్యూటర్ల కోసం తాము రూపకల్పన చేసిన లేటెస్ట్ వర్షన్ డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టం ఓఎస్ ఎక్స్ యోసీమైట్ (OS X Yosemite) ద్వారా ఐఫోన్ కాల్స్ నిర్వహించుకోవచ్చని ఈ సందర్భంగా ఫెడిర్గీ తెలిపారు.

ఐఓఎస్ 8 బేటా వర్షన్ సాఫ్ట్‌వేర్‌ను ఐఓఎస్ డెవలపర్ ప్రోగ్రామ్ సభ్యులు సత్వరమే developer.apple.com ద్వారా పొందవచ్చు. ఐఓఎస్8 ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఈ సీజన్‌లోనే ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐపోడ్ టచ్, ఐపోడ్ టచ్ 5వ జనరేషన్, ఐప్యాడ్ 2, ఐప్యాడ్ విత్ రెటీనా డిస్‌ప్లే, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ మినీ రెటీనా డిస్‌ప్లే వంటి యాపిల్ ఉత్పత్తులకు అందుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot