భారత్‌లోనే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం : జియోమీ

Posted By:

జియోమీ స్మార్ట్‌ఫోన్‌లలో సెక్యూరిటీ పరమైన లోపాలున్నట్లు భారత వైమానిక దళం హెచ్చరికలు జారీ చేసిన నేపధ్యంలో సదరు చైనా మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో, తమ స్మార్ట్‌ఫోన్‌ల పై నెలకున్న అనుమానాలను నివృత్తి చేసే యత్నాలను జియోమీ ప్రారంభించింది. తాజా వివాదం నేపథ్యంలో తమ క్లౌడ్ డేటా సెంటర్‌ను భారత్‌లోనే ఏర్పాటు చేయనున్నట్లు జియోమీ ప్రకటించింది.

భారత్‌లోనే డేటా సెంటర్‌: జియోమీ

డేటా సెంటర్‌ను భారత్‌లోనే నెలకొల్పటం వల్ల ఇక్కడి వినియోగదారుల డేటా భద్రతకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తవని జియోమీ భావిస్తోంది. ఈ అంశం పై జియెమీ సంస్థ అధ్యక్షుడు హ్యూగో బెర్రా స్పందిస్తూ అమెజాన్.కామ్ భాగస్వామ్యంతో భారత్‌లో వచ్చే ఏడాది ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్‌కు ‘యాపిల్ ఆఫ్ చైనా' అని నామకరణం చేస్తామని తెలిపారు. ఇప్పటికే తమ ఖాతాదారుల డేటాను చైనా నుంచి యూఎస్, సింగపూర్ సర్వర్లకు తరలించే కార్యక్రమాన్ని జియోమీ చేపట్టిందని హ్యూగో బెర్రా ఈ సందర్భంగా గుర్తు చేసారు.

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లతో లభ్యమవుతోన్న జియోమీ స్మార్ట్‌ఫోన్‌లకు భారత్ మార్కెట్లో మంచి గిరాకీనే ఉంది. ఇండియన్ మార్కెట్లో వారానికి లక్ష స్మార్టో‌ఫోన్‌లను విక్రయించేలానే లక్ష్యంతో ముందుకు సాగుతోన్న జియోమీకి ఈ వివాదం పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Xiaomi to open India data centre to allay privacy fears. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot