మార్కెట్లోకి ప్రపంచపు వేగవంతమైన టాబ్లెట్!!
ఎన్విడియా టెగ్రా 4 ప్రాసెసింగ్ సామర్ధ్యంతో కూడిన శక్తివంతమైన టాబ్లెట్ పీసీని ప్రముఖ కంపెనీ జోలో సోమవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. టాబ్లెట్ పేరు ‘జోలో ప్లే టెగ్రా నోట్'. ధర రూ.17,999. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ డివైజ్ అమ్మకాలు నేటి నుంచే ప్రారంభమయ్యాయి.
జోలో ప్లే టెగ్రా నోట్ వై-ఫై వర్షన్‌లో మాత్రమే లభ్యమవుతోంది. ప్రస్తుతానికి ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 4.2.2 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. భవిష్యత్‌లో ఈ డివైజ్ ఆపరేటింగ్ సిస్టంను ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ లేదా ఆండ్రాయిడ్ 4.4 కిట్ కాట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే....

7 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ద్యం 1280x800పిక్సల్స్), 1.8గిగాహెట్జ్ టెగ్రా 4 ప్రాసెసర్, 72 కోర్ జీఫోర్స్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఏ15 సీపీయూ, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా టాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత. 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.
టాబ్లెట్ ముందు భాగంలో బాస్ రిఫ్లెక్ట్ పోర్ట్‌తో కూడిన హైడెఫినిషన్ ఆడియో స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేసారు. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే... వై-ఫై, వై-ఫై హాట్ స్పాట్, డబ్ల్యూఎల్ఏఎన్, బ్లూటూత్ 4.0, యూఎస్బీ 2.0, 4100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (8.2 గంటల వెబ్ బ్రౌజింగ్, 10 గంటల హైడెఫినిషన్ వీడియో ప్లేబ్యాక్). టాబ్లెట్ బరువు 320 గ్రాములు, పరిమాణం 199x119x9.6 మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








