సీఈఎస్ 2014లో జోలో విండోస్ టాబ్లెట్

Posted By:

లాస్ వేగాస్‌లో జరుగుతున్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2014 వేదికగా ప్రముఖ ఇండియన్ కంపెనీ జోలో ‘విన్ 10.1' సరికొత్త విండోస్ 8 టాబ్లెట్‌ను ప్రకటించింది. నిపుణులు ఇంకా యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడిన ఈ టాబ్లెట్ శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థను కలిగి ఉంది. జోలో విన్ 10.1 ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే......

సీఈఎస్ 2014లో జోలో విండోస్ టాబ్లెట్

10.1 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1366 x768పిక్సల్స్), విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టం, 1.0గిగాహెట్జ్ ఏఎమ్‌డి ఏ4 ఇలైట్ (1GHz AMD A4 Elite) మొబిలిటీ ప్రాసెసర్, రాడియోన్ హైడెఫినిషన్ 8180 (Radeon HD 8180) గ్రాఫిక్స్ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైజ్ మెమరీని మరింత పొడిగించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల బ్యాటరీ బ్యాకప్). ఇండియన్ మార్కెట్లో ఈ డివైజ్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఈఎస్ 2014లో మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్

భారతదేశపు రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ మైక్రోమాక్స్ సీఈఎస్ 2014 వేదికగా రెండు ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేసే డ్యుయల్-బూట్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ‘మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్'గా నామకరణం చేయబడిన ఈ డ్యుయల్ - బూట్ డివైజ్ ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఇంకా విండోస్ 8.1 ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ ఆవిష్కరణతో డ్యుయల్-బూట్ టాబ్లెట్ డివైజ్‌ను పరిచయం చేసిన తొలి భారతీయ కంపెనీగా మైక్రోమాక్స్ గుర్తింపుతెచ్చుకుంది. మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ కీలక

స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...... 10.1 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1,280 x 800పిక్సల్స్), 1.4గిగాహెట్జ్ ఇంటెల్ సిలిరాన్ ఎన్2805 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా స్టోరేజ్ సామర్ద్యాన్ని విస్తరించుకునే సౌలభ్యత, 2 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7,400ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డివైజ్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే బ్లూటూత్ 4.0, ఏ-జీపీఎస్, వైర్‌లెస్ కీబోర్డ్ వ్యవస్థ, మధ్యముగింపు హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్న ఈ డ్యుయల్ - బూట్ టాబ్లెట్ పీసీకి ఇండియన్ మార్కెట్లో ఎటువంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి. ఇండియన్ మార్కెట్లో మైక్రోమాక్స్ ల్యాప్‌టాబ్ ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానుంది. ధర‌కుసంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot