ఆన్‌లైన్ మార్కెట్లోకి జోలో విండోస్ 8.1 ట్యాబ్లెట్

Posted By:

 ఆన్‌లైన్ మార్కెట్లోకి  జోలో విండోస్ 8.1 ట్యాబ్లెట్

సీఈఎస్ 2014 వేదికగా లావా ఇంటర్నేషనల్ ప్రదర్శించిన తొలి జోలో బ్రాండ్ విండోస్ 8.1 ట్యాబ్లెట్ ‘జోలో విన్' (Xolo Win) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో విడుదలైంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్. కామ్ ( Flipkart.com) ఈ లేటెస్ట్ వర్షన్ పోర్టబుల్ కంప్యూటింగ్ విండోస్ డివైస్‌ను రూ. 19,990కి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. ఔత్సాహికులు తమ పాత స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్‌ను ఎక్స్‌ఛేంజ్ రూపంలో చెల్లించి ఆయా మోడల్‌ను బట్టి రూ.3,000 నుంచి రూ.5,000 ధర తగ్గింపుతో జోలో విన్ ట్యాబ్లెట్‌ను పొందవచ్చు. ఇవే కాకుండా, జోలో విన్ కొనుగోలుదారులు తమకు వర్తించే క్యాష్ బ్యాక్ ఆఫర్‌లో భాగంగా తరువాత కొనుగోలు చేసే బ్లూటూత్ కీబోర్డ్ పై 50శాతం వరకు ధర రాయితీని పొందవచ్చు. జోలో విన్ విండోస్ 8.1 ట్యాబ్లెట్ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.

విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, 10.1 అంగుళాల మల్టీటచ్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్1366x 768పిక్సల్స్), 10 ఫింగర్ టచ్‌స్ర్కీన్ రికగ్నిషన్ ఫీచర్, ఏఎమ్‌డి టిమాష్ ఏ4-1200 ప్రాసెసర్, రాడియోన్ హైడెఫినిషన్ 810 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ట్యాబ్లెట్ మెమరీని మరింతగా విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1 మెగా పిక్సల్ హైడెఫినిషన్ ఫ్రంట్ వెబ్‌క్యామ్, కనెక్టువిటీ ఫీచర్లు (మైక్రో హెచ్‌డిఎమ్ఐ పోర్ట్, మినీ యూఎస్బీ పోర్ట్), 6 గంటల బ్యాటరీ లైఫ్. విండోస్ విన్ ట్యాబ్లెట్‌లో లోడ్ చేసిన ప్రీలోడెడ్ ఫీచర్లు...మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట స్కైప్, మైక్రోసాఫ్ట్ ఆన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ బింగ్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot