మై టాబ్లెట్ జస్ట్ ఫర్ 7,500!!

Posted By: Prashanth

మై టాబ్లెట్ జస్ట్ ఫర్ 7,500!!

 

Xtex సంస్థ లాంఛ్ చేసిన ‘మై టాబ్లెట్’ అందుబాటైన ధరకే లభ్యంకానుంది. ఇండియన్ మార్కెట్లో ఆండ్రాయిడ్ ఆధారిత చవక టాబ్లెట్ కంప్యూటర్లకు మంచి డిమాండ్ నెలకన్న నేపధ్యంలో తమ డివైజ్‌కు సైతం మిశ్రమ స్పందన లభిస్తుందనే ధీమాను బ్రాండ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో మై టాబ్లెట్ ధర అంచనా రూ.7,500.

టాబ్లెట్ ముఖ్య ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 4.0.3 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం,

1.5గిగా హెడ్జ్ ప్రాసెసర్,

1జీబి ర్యామ్,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్,

48జీబి ఎక్సప్యాండబుల్ మెమరీ,

వై-ఫై,

యూఎస్బీ కనెక్టువిటీ,

టీఎఫ్ కార్డ్ స్లాట్.

టాబ్లెట్ మెమరీ సామర్ధ్యాన్ని పరిశీలిస్తే... 1జీబి ర్యామ్‌తో పాటు 16జీబి హార్డ్‌డిస్క్ డ్రైవ్‌లను నిక్షిప్తం చేశారు. టీఎఫ్ కార్డ్ స్లాట్ సౌలభ్యతతో మెమెరీని 48జీబికి పెంచుకోవచ్చు. లోడ్ చేసిన ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం అత్యుత్తమ పనితీరును కనబురుస్తుంది. నిక్షిప్తం చేసిన 1.5గిగాహెడ్జ్ ట్రిగ్గెడ్ ప్రాసెసర్ వేగవంతమైన పనితీరునందిస్తుంది. ఏర్పాటు చేసిన వై-ఫై వ్యవస్థ హై స్పీడ్ నెట్ బ్రౌజింగ్‌కు ఉపకరిస్తుంది. బ్లాక్, వైట్ ఇంకా పింక్ కలర్ వేరియంట్‌లలో ఈ టాబ్లెట్ లభ్యం కానుంది. తక్కువ ధరకే లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ టాబ్లెట్ పీసీలలో ‘మై టాబ్లెట్’ ఉత్తమమైనది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot